UP Assembly Election 2022: సమాజ్ వాదీ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ నాయకుడు..

|

Jan 13, 2022 | 3:21 PM

అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీవారు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఆ పార్టీలోని...

UP Assembly Election 2022: సమాజ్ వాదీ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ నాయకుడు..
Bjp
Follow us on

Uttar Pradesh Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీవారు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఆ పార్టీలోని జంపింగ్ జపాంగ్స్ ఇటు.. ఈ పార్టీలోనివారు అటు దూకుతున్నారు. మొన్నటి మొన్న బీజేపీ పార్టీకి చెందిన ఓ మంత్రి ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీ పార్టీలో చేరితే.. తాజాగా ఎస్పీకి చెందిన నాయకుడు హరిఓమ్ యాదవ్ బీజేపీలో చేరారు. ఇతనితోపాటు మరికొందరు ఎస్పీ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూాడా బీజేపీ కండువ కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే కమలం పార్టీలో చేరిన హరిఓమ్ యాదవ్.. ఎస్పీపై విమర్శలు గుప్పించారు. సమాజ్‌వాదీ పార్టీ ఇకపై ములాయం సింగ్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ తండ్రి) పార్టీ కాదు.. అది అఖిలేష్‌ను చుట్టుముట్టిన బూట్‌లిక్కర్ల పార్టీ అంటూ ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు.

మూడుసార్లు ఎమ్మెల్యే..

మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హరిఓమ్ యాదవ్ గత ఏడాది ఫిబ్రవరిలో ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాల’ కారణంగా బహిష్కరించబడ్డారు. గత ఏడాది ఫిరోజాబాద్ పంచాయతీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించి బీజేపీకి చెందిన హర్షిత సింగ్ విజయం సాధించడంలో సహకరించాడని హరిఓమ్‌పై విమర్శలున్నాయి. అప్పటి నుంచి సమాజ్‌వాదీ పార్టీతో విభేదాలు ఉన్నాయి. బీజేపీలో చేరిన హరిఓమ్ యాదవ్ కూడా ములాయం యాదవ్ బంధువు.

సమాజ్‌వాదీ పార్టీ నుండి హరిఓమ్ యాదవ్, ధరంపాల్ సింగ్, కాంగ్రెస్‌కు చెందిన నరేష్ సైనీలను బిజెపి చేర్చుకోవడంతో ఈ వారం 48 గంటల వ్యవధిలో మంత్రులు దారా సింగ్ చౌహాన్, స్వామి ప్రసాద్ మౌర్యతో సహా ఆరుగురు నేతలు బిజెపిని వీడారు.

ఇవి కూడా చదవండి: PM Modi: ముఖ్యమంత్రులతో గురువారం ప్రధాని మోడీ సమావేశం.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ..

UP Elections: 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. 50మంది మహిళలకు ఛాన్స్