UP Elections: 2017 కంటే నాల్గవ దశలో 1% తక్కువ పోలింగ్.. BJP లాభమా, నష్టమా?

|

Feb 24, 2022 | 8:32 AM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 7 విడతల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 9 జిల్లాల్లోని 59 స్థానాల్లో ఈసారి 61.52 శాతం ఓట్లు పోలయ్యాయి.

UP Elections: 2017 కంటే నాల్గవ దశలో 1% తక్కువ పోలింగ్.. BJP లాభమా, నష్టమా?
Up Bjp
Follow us on

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 7 విడతల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్(Polling) బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 9 జిల్లాల్లోని 59 స్థానాల్లో ఈసారి 61.52 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ దశ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలోని 45 జిల్లాల్లోని 231 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు(UP Assembly poll) జరిగాయి. రాష్ట్రంలో మిగిలిన మూడు దశలకు ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో పోలింగ్ నిర్వహించి, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ దశలో 59 స్థానాలకు 624 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఏ జిల్లాలో ఎంత శాతం ఓటింగ్ జరిగింది ?

పిలిభిత్‌లో 67.59 శాతం
లఖింపూర్ ఖేరీలో 66.32 శాతం
సీతాపూర్‌లో 62.66 శాతం
హర్దోయ్‌లో 58.99 శాతం
ఉన్నావ్‌లో 57.73 శాతం
లక్నోలో 60.05 శాతం
రాయ్‌బరేలీలో 61.90 శాతం
బండలో 60.36 శాతం
ఫతేపూర్‌లో 60.07 శాతం

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో 62.55 శాతం ఓట్లు పోల్ అవ్వగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 60.03 శాతం ఓట్లు పోలయ్యాయి. 2017 ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ 51 స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానాన్ని దాని మిత్రపక్షం అప్నా దళ్ (ఎస్) గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ నాలుగు సీట్లు, కాంగ్రెస్‌ రెండు స్థానాలు, బీఎస్పీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి.

ఈ దశలో బీజేపీకి ప్రయోజనం ఉంటుందా?
గత మూడు ఎన్నికలను ఒకదానితో ఒకటి పోల్చి చూస్తే ఓట్ల శాతం పెరిగినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలు లాభపడ్డాయి. కానీ ఈసారి ఓట్ల శాతం ఒక్క శాతం తగ్గింది. 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే, అప్పుడు ఎనిమిది శాతం పోలింగ్ ఎక్కువగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ 22 సీట్లు సాధించింది. అదేవిధంగా, 2017 ఎన్నికల్లో ఐదు శాతం ఓటింగ్ పెరగడం వల్ల బీజేపీకి దాదాపు 48 సీట్ల బంపర్ అడ్వాంటేజ్ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా బీజేపీకి లాభం చేకూరవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత నాలుగు ఎన్నికల్లో ఓట్ల శాతం ఎంత ?

సంవత్సరం 2007 – 49.05 శాతం
 2012 – 57.52 శాతం
2017 – 62.55 శాతం
2022 – 61.52 శాతం

ఈసారి మునుపటి ప్రదర్శనను పునరావృతం చేయడం బీజేపీకి పెద్ద సవాలు. ఈ దశలో రైతు ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన లఖింపూర్ ఖేరీలో కూడా భారీగానే పోలింగ్ జరిగింది. ముఖ్యంగా అక్టోబర్ 3న జరిగిన ఘటన తర్వాత కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టేనీ కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన ఎస్‌యూవీ కారు నలుగురు రైతులపై దూసుకుపోయింది. ఆశిష్ మిశ్రా గత వారం జైలు నుంచి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటనపై విపక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తూ మిశ్రాను విడుదల చేయడం విమర్శలను మరింత పెంచింది. అక్టోబరులో జరిగిన ఘటన జిల్లా ప్రజలకు ఇంకా గుర్తున్నదని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఈ దశ బీజేపీకి కీలకం
గత ఎన్నికల్లో సాధించిన 51 సీట్లను నిలబెట్టుకోవడం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారిందని చెప్పాలి. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో బీజేపీకి ప్రతిఘటన ఎదురవుతోందని భావిస్తున్నారు. వరుణ్ గాంధీ రైతు ప్రాబల్య నియోజకవర్గమైన పిలిభిత్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.

Read Also…

UP Elections: యూపీలో దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు.. అమేథీలో ప్రధాని మోడీ, ప్రతాప్‌గఢ్‌లో అఖిలేష్ ప్రచారం

UP Elections: గౌతమ బుద్ధుడిని అవమానించిన అఖిలేష్ యాదవ్! కేశవ్ మౌర్య ట్వీట్‌తో వైరల్ అవుతున్న వీడియో