Tamilnadu elections 2021:దోసెలు వేసి, బట్టలు ఉతికి, తమిళనాట పార్టీ నేతల ఫీట్లు ఇన్నిన్ని కావు మరి !

| Edited By: Anil kumar poka

Mar 25, 2021 | 1:57 PM

తమిళనాడు  ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు  ఆయా పార్టీల నేతలు చేస్తున్న ఫీట్లు ఇన్నీ అన్నీ కావు. ఎలాగైనా సరే.. వాళ్ళ 'మనసుల్ని' తమ ఓట్లుగా  మలుచుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

Tamilnadu elections 2021:దోసెలు వేసి, బట్టలు ఉతికి, తమిళనాట పార్టీ నేతల ఫీట్లు ఇన్నిన్ని కావు మరి !
Tamilnadu Elections Candidates Make To Get Votes
Follow us on

తమిళనాడు  ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు  ఆయా పార్టీల నేతలు చేస్తున్న ఫీట్లు ఇన్నీ అన్నీ కావు. ఎలాగైనా సరే.. వాళ్ళ ‘మనసుల్ని’ తమ ఓట్లుగా  మలుచుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కో పార్టీ నేతదీ ఒక్కో టైపు ! కొందరు వీధుల్లో దోసెలు వేస్తే, మరికొందరు రోడ్ల మీదే బకెట్లు, నీళ్లు పెట్టుకుని బట్టలు ఉతికేస్తున్నారు. ముఖ్యంగా డీఎంకే, అన్నా డీఎంకే అభ్యర్థులైతే ఇలా జనాల  మధ్య రకరకాల ‘విన్యాసాలు’ ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు చెన్నై లోని విరుంగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజా..  ఉధృతంగా ప్రచారం చేస్తూ.. రోడ్డు పక్కన దోసెలు వేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి అతడ్ని ‘ ఆప్యాయంగా ‘ పలకరించి అతని చేతిలో నుంచి అట్లకాడ తీసుకున్నారు. అక్కడే  తాను దోసెలు వేసి  అందరికీ పంచిపెట్టారు. ‘అయ్యా ! మీరు నా చేత్తో వేసిన దోసెలు తినండి.. బదులుగా నాకే ఓటు వేయండి’ అంటూ కోరారు.

ఇక నాగపట్నం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థి తంగ కతివరన్…రోడ్డు పక్కనే బట్టలు ఉతికారు.తాను  ఓటర్ల బట్టలు ఉతుకుతున్నానని,  ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. వాషింగ్ మెషిన్లను  ఉచితంగా పంపిణీ చేస్తానని, అలాగే ఫ్రీగా గ్యాస్ స్టవ్ లను, ఫ్రీగా  టీవీ కేబుల్ కనెక్షన్ కూడా ఇస్తానంటూ ఆయన హామీలు ఇస్తున్నాడు.

ఇక మదురై సౌత్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న తులం శరవణన్ అనే అభ్యర్థి.. తాను గెలిస్తే చంద్ర మండలానికి ఓటర్లను పంపుతానని, ఓ మినీ హెలికాఫ్టర్, ప్రతి ఇంటికీ సాలుకు కోటి రూపాయల డిపాజిట్, వివాహాలకు బంగారు నగలు, మూడంతస్థుల ఇల్లు ఇస్తానంటున్నాడు. 33 ఏళ్ళ ఈయన జర్నలిస్టు కూడా నట. ఈ అభ్యర్థి ఎన్నికల చిహ్నం ‘చెత్త కుండీ’ ! తన హామీలు నెరవేర్చక పోతే ఓటర్లు ఇలాగే  తనకు శాస్తి చేస్తారంటున్నాడు.

మరిన్ని చదవండి ఇక్కడ :భారత్‌లో మితిమీరి రెచ్చిపోతున్న కరోనా సెకండ్ వేవ్..18 రాష్ట్రలో లాక్‌డౌన్..? : Coronavirus in India video.

నడిరోడ్డుపై తలస్నానం, షేవింగ్ చేస్తూ హల్ చల్ చేసిన వ్యక్తి. ..వైరల్ అవుతున్న వీడియోలు,ఫోటోలు : man bathing on Road Video

 ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా..వీడి చేష్టలకు నెటిజెన్ల ఫిదా !:Little Boy Funny Video.