ఆఫర్ ముగియనుంది.. త్వరగా ట్యాంక్ ఫుల్ చేయించుకోండి.. రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

|

Mar 05, 2022 | 10:03 PM

పెట్రోల్ రేట్ల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను(petrol prices) కేంద్ర ప్రభుత్వం..

ఆఫర్ ముగియనుంది.. త్వరగా ట్యాంక్ ఫుల్ చేయించుకోండి.. రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
Rahul Gandhi (File Photo)
Follow us on

పెట్రోల్ రేట్ల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను(petrol prices) కేంద్ర ప్రభుత్వం పెంచనుందని అన్నారు. త్వరలోనే ‘ఎన్నికల ఆఫర్’​ ముగుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలు తమ వాహనాల పెట్రోల్ ట్యాంక్​లను నింపుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్​వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పెట్రో ధరల పెంపును నిలిపివేసి, పోలింగ్ ముగియగానే బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉత్తరప్రదేశ్​సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ( Assembly Elections)ఎన్నికలు మార్చి 7తో ముగుస్తాయి. మార్చి10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read

Tamilisai : శాసన సభ్యులు ఆ హక్కును కోల్పోయినట్లే.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై స్పందించిన తమిళి సై..

Chiranjeevi: ఊరమాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లకే ఓటేస్తున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కు పూనకాలే..

Manipur Elections: మణిపూర్‌లో ముగిసిన తుది విడత పోలింగ్.. పలుచోట్ల హింసాత్మక ఘటనలు!