Punjab Elections: పంజాబ్‌లో ఎన్నికల ముందు భారీ షాక్.. కాషాయం కండువా కప్పుకున్న సీఎం చన్నీ సోదరుడు

|

Jan 12, 2022 | 7:52 AM

Punjab Politics: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సమీప బంధువు జస్వీందర్ సింగ్ ధాలివాల్ భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరారు.

Punjab Elections: పంజాబ్‌లో ఎన్నికల ముందు భారీ షాక్.. కాషాయం కండువా కప్పుకున్న సీఎం చన్నీ సోదరుడు
Bjp
Follow us on

Punjab CM Charanjit Singh Channi brother Jaswinder Singh Dhaliwal: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Assembly Elections 2022) ముందు అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలింది. పంజాబ్(Punjab) ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) సమీప బంధువు జస్వీందర్ సింగ్ ధాలివాల్ (Jaswinder Singh Dhaliwal) మంగళవారం భారతీయ జనతా పార్టీ పార్టీ(BJP)లో చేరారు. చండీగఢ్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో BJPలో చేరారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఫిబ్రవరి 14న పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జంపింగ్, జపాంగ్‌ల సందడి కొనసాగుతోంది.

పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ లేదా కూటమి అయినా 59 ఎమ్మెల్యే స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రత్యర్థి శిబిరంలో శిరోమణి అకాలీదళ్‌తో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భారతీయ జనతా పార్టీ, మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్ అమరీందర్ సింగ్‌ల పార్టీ పోటీ పడుతున్నాయి . 2017 అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత 77 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. శిరోమణి అకాలీదళ్ బీజేపీ కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమిమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 20 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ కెప్టెన్ అమరీందర్ స్థానంలో చరణ్‌జి‌త్ సింగ్ చన్నీని సీఎం చేసింది కాంగ్రెస్ అధిష్టానం.


ఇదిలావుంటే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భద్రత లోపం కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇటీవల పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీ కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రధాని కాన్వాయ్ 15 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పైనే ఇరుక్కుపోయింది. పరిష్కారం కనుగొనబడకపోవడంతో, PM మోడీ అక్కడి నుండి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. పంజాబ్‌లో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే సమయంలో, కాంగ్రెస్ ఈ సంఘటనను నాటకీయంగా అభివర్ణిస్తోంది, అయితే బీజేపీ మాత్రం చన్నీ ప్రభుత్వంపై దాడి చేస్తోంది. అయితే, పంజాబ్ ఎన్నికల్లో ఈ ఘటన ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, జనవరి 8న ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వ్యూహరచన చేయడం ప్రారంభించాయి. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటివరకు ఎనిమిదో విడత అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 104 మంది అభ్యర్థులను ప్రకటించింది.
Read Also… BJP MLA Missing: యూపీలో బీజేపీ ఎమ్మెల్యే అదృశ్యం.. కేసు పెట్టిన కూతురు.. పోలీసుల ఎంక్వేరిలో షాకింగ్ న్యూస్