BJP MLA Missing: యూపీలో బీజేపీ ఎమ్మెల్యే అదృశ్యం.. కేసు పెట్టిన కూతురు.. పోలీసుల ఎంక్వేరిలో షాకింగ్ న్యూస్

స్వామి ప్రసాద్ మౌర్య ( Swami Prasad Maury) సమాజ్ వాదీ పార్టీలో చేరిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కదలికను మొదలయ్యాయి

BJP MLA Missing: యూపీలో బీజేపీ ఎమ్మెల్యే అదృశ్యం.. కేసు పెట్టిన కూతురు.. పోలీసుల ఎంక్వేరిలో షాకింగ్ న్యూస్
Politics

BJP MLA inay Shakia Missing: స్వామి ప్రసాద్ మౌర్య ( Swami Prasad Maury) సమాజ్ వాదీ పార్టీలో చేరిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కదలికను మొదలయ్యాయి. ఇప్పుడు ఔరైయా జిల్లాలోని బిధునా స్థానం నుంచి ఎమ్మెల్యే వినయ్ షాక్యా (BJP MLA Vinay Shakya) అదృశ్యమయ్యారనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే వినయ్ షాక్యా కూతురు రియా తన తండ్రి కనిపించకుండా పోయారని ఆరోపిస్తూ తన తండ్రిని కనుక్కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన తండ్రిని, తన మామ లక్నో తీసుకెళ్లాడని రియా షక్య చెప్పింది. ఇప్పుడు తన తండ్రి వినయ్ షాక్యా గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారని రియా తెలిపింది. స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party)లో చేరినప్పటి నుండి వాదనలు జరుగుతున్నాయి. UP కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అర డజను మంది శాషన సభ్యులతో బీజేపీలో చేరారు.

అయితే, ఈ కేసులో పోలీసులు మరో మాట చెబుతున్నారు. ఎమ్మెల్యే వినయ్ షాక్యా తప్పిపోయారనే వాదన నిరాధారమైనదన్నారు. అబద్ధమని ఔరైయా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ వర్మ పేర్కొన్నారు. వినయ్ షాక్యా ఇటావాలోని తన నివాసంలో ఉన్నాడని, అతను పూర్తిగా క్షేమంగా ఉన్నాడని తెలిపారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, బిదునా ఎమ్మెల్యే వినయ్ షాక్యా కుమార్తె తన మామ దేవేష్ షాక్యా కూడా సమాజ్ వాదీ పార్టీలో చేరమని తన తండ్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. మంగళవారం, వినయ్ షాక్య గురించి ఎటువంటి సమాచారం రాకపోవడంతో, అతని కుమార్తె రియా ముందుకు వచ్చింది. అమె తండ్రి ఎక్కడ ఉన్నారనే దానిపై తనకు సమాచారం లేదని చెప్పారు. రియా మాట్లాడుతూ, “మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. మేము మా ప్రాంతంలో బీజేపీకి పని చేస్తున్నాము. కానీ మామయ్య, మా నాన్నను లక్నో తీసుకెళ్లారు. వారి గురించి త్వరగా తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తన తండ్రికి మే 1, 2018న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, ఆ తర్వాత లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలో చేరారని ఆయన చెప్పారు. అమె తండ్రి స్పష్టంగా కమ్యూనికేట్ చేయలేడు, ఆపరేషన్ తర్వాత, అతని ఆలోచనా శక్తి కూడా తగ్గిపోయిందన్నారు.

ఇదిలావుండగా, ఔరయా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ వర్మ మిస్సింగ్ ఎమ్మెల్యే వినయ్ షాక్యా ఆరోపణలను కొట్టిపారేశారు. కుటుంబ కలహాలతో కేసు పెట్టారని అన్నారు. ఎమ్మెల్యేతో తానే స్వయంగా వీడియో కాల్ చేశానని వర్మ పేర్కొన్నారు. అతను ప్రస్తుతం ఇటావా జిల్లాలోని శాంతి కాలనీలోని తన ఇంట్లో తన తల్లితో ఉన్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి కూడా ఉన్నారు.

ఇదిలావుంటే, మంగళవారం ఉదయం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి, సీనియర్ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరతారని మౌర్య ప్రకటించారు. అయితే, ఈ ఎమ్మెల్యేల పేర్లను మాత్రం ఆయన చెప్పలేదు. మౌర్య రాజీనామా తర్వాత ఆయనకు మద్దతుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్యేలు కాన్పూర్ దేహత్ నుండి భగవతీ సాగర్, తిల్హార్ నుండి రోషన్ లాల్ వర్మ, బండా నుండి బ్రిజేష్ కుమార్ ప్రజాపతి.

ఎన్నికలకు ముందు మౌర్య బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. యూపీలో అసెంబ్లీ ఎన్నికల తేదీల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుండగా, ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్‌ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

Read Also…  UP Assembly election 2022: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌… సైకిల్‌ ఎక్కిన మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు

Click on your DTH Provider to Add TV9 Telugu