Punjab Hoshiarpur CM Arvind Kejriwal: పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల వాగ్దానాల పర్వం మొదలైంది. ఢిల్లీ తర్వాత పంజాబ్ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ ప్రజలకు హామీ వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ప్రజలకు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీగా వాగ్దానాలు చేశారు.
పంజాబీలపై ఇప్పటికే పలు వరాలజల్లు కురిపించిన ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం దళితులు, అణగారినవర్గాల కోసం మరిన్ని హామీలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో హోషియార్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తూ, షెడ్యూల్డ్ కులాల ప్రజలకు 5 వాగ్దానాలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ విద్యార్ధులకు ఉచిత విద్య అందించడంతో పాటు ఐఏఎస్, మెడికల్, ఐఐటీలకు ఉచిత కోచింగ్, ఉచిత విదేశీ విద్య, ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 18 ఏండ్ల దాటిన మహిళలకు నెలకు 1000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Punjab की SC बिरादरी के लिए @ArvindKejriwal जी की 5 Guarantee:
1⃣बच्चों को FREE में शानदार शिक्षा
2⃣IAS-Medical-IIT समेत हर Coaching FREE
3⃣Graduation-PG के लिए विदेश में पढ़ाई FREE
4⃣छोटी बीमारी से लेकर बड़े Operation तक FREE
5⃣18 साल से ऊपर की हर महिला को 1-1 हज़ार रुपए pic.twitter.com/n0tD4A8BAi— AAP (@AamAadmiParty) December 7, 2021
గత 75 ఏళ్లలో ఈ నాయకులు, పార్టీలు విద్యారంగాన్ని నాశనం చేశాయన్నారు. ఉద్దేశపూర్వకంగా నౌకాదళాన్ని, ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేశారని ఆరోపించారు. తద్వారా పేద దళిత, వెనుకబడిన తరగతుల పిల్లలు చదవలేకపోయారు. ఈ తరగతి వారి హక్కును సాధించలేక సమాన స్థాయిలో నిలబడలేకపోయారన్నారు.
ఎస్సీ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి చన్ని తన కులం కార్డు వాడుతూ ఆ వర్గీయుల ఓట్లుకు గాలం వేశారని ఆరోపించారు. తాను ఎస్సీ కాకపోయినా మీ కుటుంబ సభ్యుడిగా ముందుకొచ్చానని, కేవలం కులం పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతి బిడ్డకు మంచి విద్యను అందించాలని బాబాసాహెబ్ ఎన్నో కలలు కన్నారని, గత 75 ఏళ్లలో ఇదంతా జరగలేదన్నారు. ఇప్పుడు బాబా కలను నెరవేరుస్తామని ప్రమాణం చేసిన కేజ్రీవాల్.. ‘బాబా నెరవేరని కల కేజ్రీవాల్ నెరవేరుస్తుంది’ అని ఆయన అన్నారు. మీ సమాజాన్ని వెనుకబాటుతనం నుండి పారద్రోలాలంటే, పేదరికాన్ని దూరం చేసి, మీ సమాజానికి హక్కులు కల్పించాలంటే, మంచి చదువులు చెప్పండి, మన పిల్లలు చదువుకుంటే, పేదరికం కలిసి పోతుందని, ఒక్కటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారని కేజ్రీవాల్ అన్నారు.
దేశంలోనే పంజాబ్ స్కూళ్లు నంబర్ వన్‌గా ఉన్నాయని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మీ పిల్లలకు మంచి చదువులు చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని మార్చండంటూ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీతో ముందుకొచ్చిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాషాయ పార్టీతో జట్టుకట్టి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.