మహారాష్ట్రలో బీజేపీ ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు NCP చీలిక తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ 88 శాతం స్ట్రయిక్ రేట్ సాధించింది. శివసేన షిండే వర్గం 65 శాతం, NCP అజిత్ పవార్ వర్గానికి 63 శాతం స్ట్రయిక్ రేటు సాధించింది..
జార్ఖండ్‌లో 24 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టారు హేమంత్ సోరెన్.. వరుసగా రెండోసారి ఏ పార్టీ అక్కడ గెలవదన్న సెంటిమెంట్‌ను ఓటర్లు పక్కన పెట్టారు.. అంతేకాదు జైలుకు వెళ్లిన నేతలకు మంచే జరుగుతుందని హేమంత్ సోరెన్ వ్యవహారం నిరూపించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మహాయుతి ధీామాతో ఉంది. కాగా, తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎంవీఏ చెబుతోంది. మహాయుతి మళ్లీ విజయం నమోదు చేస్తే మళ్లీ అధికారంలోకి వస్తుంది. అయితే ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే అందరి చూపు ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అన్నదీ ఆసక్తికరంగా మారింది.
యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది మధ్యాహ్నానికి తేలనుంది. రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. ఈసారి 65 శాతం ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలోని 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మెషీన్‌లో నిక్షిప్తమైంది. ఈరోజు జరిగే ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థి శాసనసభకు వెళ్తారు.. ఎవరు ఇంట్లో కూర్చుంటారో తేటతెల్లం కానుంది. చాలా ప్రాంతాల్లో పదునైన ఘర్షణలు ఉండబోతున్నాయి, ఎన్నికల వార్తలతో సహా అనేక ముఖ్యమైన వార్తల నవీకరణలను పొందడానికి రోజంతా ఈ బ్లాగ్‌ని అనుసరించండి.
జార్ఖండ్‌లో 24 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టారు హేమంత్ సోరెన్.. వరుసగా రెండోసారి ఏ పార్టీ అక్కడ గెలవదన్న సెంటిమెంట్‌ను ఓటర్లు పక్కన పెట్టారు.. అంతేకాదు జైలుకు వెళ్లిన నేతలకు మంచే జరుగుతుందని హేమంత్ సోరెన్ వ్యవహారం నిరూపించింది.
జార్ఖండ్‌లో 81 సీట్లకు
కాంగ్రెస్ కూటమి -57
బీజేపీ -23
ఇతరులు -1
మహారాష్ట్రలో బీజేపీ ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు NCP చీలిక తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ 88 శాతం స్ట్రయిక్ రేట్ సాధించింది. శివసేన షిండే వర్గం 65 శాతం, NCP అజిత్ పవార్ వర్గానికి 63 శాతం స్ట్రయిక్ రేటు సాధించింది..
288 సీట్లకు
మహాయుతి 229 స్థానాలు, మహా వికాస్ అగాఢి 46, ఇతరులు 13 సీట్లు దక్కించుకున్నారు
మహాయుతి కూటమి:
బీజేపీ 132, శివసేన (షిండే) 56, ఎన్సీపీ (అజిత్ పవార్) 41
మహా వికాస్ అగాఢి:
కాంగ్రెస్ 16, శివసేన (ఉద్దవ్ థాక్రే) 20, ఎన్సీపీ (శరద్ పవార్) 10
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. డబుల్ సెంచరీ సీట్లను దాటి.. రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే 225 సీట్లలో మహాయుతి లీడ్‌లో కొనసాగుతుంది. అటు మహావికాస్ అఘాడీ మాత్రం 52 సీట్లలోనే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మహాయుతి కూటమి ఘన విజయంతో నాయకులు, కార్యకర్తలంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే.. ఈనెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం జరగనుంది.. 25న మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం.. 25న మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక ఉండనుంది.
మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌పై నమ్మకం ఉంచారు
గతంలో కంటే అత్యధిక ఓట్లు, సీట్లను ప్రజలు ఇచ్చారు
కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మలేదు
రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా వచ్చేలా లేవు
-కిషన్ రెడ్డి
మహారాష్ట్ర ప్రజలు మోదీవైపే ఉన్నారు.. ఇది ఎన్డీఏ కూటమి విజయం అంటూ ఫడ్నవీస్ పేర్కొన్నారు. మహావికాస్ అఘాడీ హామీలను జనం నమ్మలేదని.. EVMలు ట్యాపరింగ్ జరిగితే జార్ఖండ్‌లో ఎలా గెలిచారంటూ ప్రశ్నించారు. CM ఎవరనేది మహాయుతి నేతలు నిర్ణయిస్తారని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై మహాకూటమిలో ఎలాంటి చర్చలు లేవని, మూడు పార్టీల నేతలు కూర్చొని, మాట్లాడుకుని, పరస్పరం చర్చించుకుని తీసుకునే నిర్ణయానికి ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషప్రచారానికి మహారాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారన్నారు.
మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింది
ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత
రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయింది
తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఇదేగతి పడుతుంది
మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయి
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో అసంతృప్తి ఉంది
-బండి సంజయ్
మహారాష్ట్ర మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటే ఉందని నిరూపితమైందన్నారు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. మోదీ ఇచ్చిన ఏక్ హై తో సీఫ్ హై నినాదాన్ని మహారాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేశారు. మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించిన సోదరీమణులకు ధన్యవాదాలు అంటూ ఏమోషనల్ అయ్యారు ఫడ్నవీస్. ప్రతిపక్షాలు సృష్టించిన నకిలీ కథనానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జాతీయ సంస్థలకు ఇది విజయమన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నించారు. ఇది మహారాష్ట్రను ఐక్యంగా ఉంచిన ప్రజలలో చైతన్యం కలిగించిన సాధువుల విజయమన్నారు.
మహారాష్ట్రలో మహాయుతికి బంపర్ మెజార్టీ వచ్చిందని షిండే ఆనందం వ్యక్తంచేశారు.. ఈ విజయం మహిళలకే అంకితం అని.. మహాయుతి కూటమి పనులకు ఇది నిదర్శనం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఏక్‌నాథ్ షిండే ధన్యవాదాలు తెలిపారు.
ముంబై: ఫడ్నవీస్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.. ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.. అయితే.. ఏక్‌నాథ్ షిండే వర్గం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.. సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదని షిండే వర్గం ఇప్పటికే స్పష్టంచేసింది..
లాతూర్ రూరల్ ధీరజ్ దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన రమేష్ కరాద్ విజయం సాధించారు. లాతూర్ రూరల్ దేశ్‌ముఖ్ కుటుంబానికి బలమైన కోటగా భావిస్తారు. అయితే ఈ ఓటమి వారికి షాక్ ఇచ్చింది.
కరాద్ దక్షిణ్‌లో మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఓటమి పాలయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన అతుల్ భోసలే విజయం సాధించారు.
జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి చరిత్రాత్మక విజయం సాధించింది. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. అమిత్ థాకరే మహిమ్‌లో పోటీ చేయగా, ఓటమి పాలయ్యారు. మహిమ్‌లో ఠాక్రే గ్రూపునకు చెందిన మహేశ్ సావంత్ విజయం సాధించారు. శివసేనకు చెందిన సదా శరవంకర్ రెండో స్థానంలో, అమిత్ థాకరే మూడో స్థానంలో ఉన్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ప్రజలు వాస్తవాలు చెప్పిన వారిని నమ్మారన్నారు. తాము ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మాయలు చేయలేదన్నారు. జార్ఖండ్ లో మంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. పదవుల పంపకంపై అధిష్టానం చర్చలు జరుపుతుందన్నారు.
బీజేపీ, మహాయుతి కూటమి అపూర్వ విజయం తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి మొదటిసారిగా స్పందించారు. తన కొడుకు దేవేంద్ర అలుపెరగని కృషి, అతనిపై ప్రజల ప్రేమ అతనికి పెద్ద విజయాన్ని అందించిందన్నారు. మహాయుతి అపూర్వ విజయం తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి తన భావాలను వ్యక్తం చేశారు.
జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో జేఎంఎం కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
#WATCH | Ranchi | JMM workers celebrate as the JMM-led alliance is leading in 51 seats in Jharkhand pic.twitter.com/Cojdab8vlr
— ANI (@ANI) November 23, 2024
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల బాధ్యతలు చేపట్టిన పూణె కంటోన్మెంట్ నియోజకవర్గం ఫలితాలు వెలువడ్డాయి. పవన్ ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన సునీల్ కాంబ్లే విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన రమేష్ బాగ్ ఓటమితో షాక్‌కు గురయ్యారు.
మహారాష్ట్రలో ఈసారి బీజేపీ ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. బీజేపీ 83 శాతం స్ట్రయిక్ రేట్ సాధించింది. శివసేన షిండే వర్గం 65 శాతం, NCP అజిత్ పవార్ వర్గానికి 63 శాతం స్ట్రయిక్ రేటు సాధించింది..
జార్ఖండ్‌లో ఫలితాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. జేఎంఎం కంటే బీజేపీ ముందుంది. బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జేఎంఎం 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే కూటమిలో జేఎంఎం మెజారిటీ సాధించింది.
మహారాష్ట్రలో ఈసారి భారతీయ జనతా పార్టీ ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు NCP చీలిక తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మూడు పార్టీల ముఖ్య నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి అభినందించారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తోపాటు బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో ఫోన్ మాట్లాడారు అమిత్ షా.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందని విమర్శించారు. మహారాష్ట్రలో ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింని వ్యాఖ్యానించారు సంజయ్.
మహారాష్ట్రలో మహాయుతి కూటమికి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుగ్. జార్ఖండ్‌లోనూ బీజేపీవైపు ప్రజలు మొగ్గు చూపారన్నారు. రెండు రాష్ట్రాల్లో యువత, రైతులు మోదీ నాయకత్వాన్ని సమర్థించారని చెప్పారు తరుణ్ చుగ్.
జార్ఖండ్‌లో మ్యాజిక్ ఫిగర్ సాధించేసింది జేఎంఎం- కాంగ్రెస్ కూటమి.. ఈ కూటమి 49 సీట్లలో ఆధిక్యతను చాటుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 30 సీట్లకే పరిమితమైంది. మరోసారి హేమంత్ సొరేన్ సర్కారు ఖాయమైపోయింది
— ఈనెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
— 25న బీజేపీ శాసనసభపక్ష సమావేశం
— అదేరోజున బీజేపీ ఎల్పీ నేత ఎన్నిక
— రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నాడు ప్రమాణస్వీకార ముహూర్తం
బీజేపీ- 130
శివసేన (షిండే వర్గం)- 56
NCP(అజిత్ గ్రూప్)- 35
కాంగ్రెస్ – 19
శివసేన (UBT) – 16
NCP(శరద్ వర్గం)-13
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మేం మెరుగ్గా రాణించగలననడంలో సందేహం లేదన్న ఆమె, అలాగే జార్ఖండ్‌లో మంచి ప్రదర్శన కనబరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు నిరాశపరిచాయి. మహారాష్ట్రలో మా ప్రచారం బాగుంది.
— 35శాతం ఓట్లు కూడా సాధించలేకపోయిన కాంగ్రెస్ కూటమి
— ఉద్ధవ్ శివసేనకు 10.60శాతం
— శరద్‌పవార్ ఎన్సీపీకి 11.54శాతం ఓట్ షేర్
— సింగిల్‌గా 11శాతం కూడా దాటని కాంగ్రెస్ ఓట్ షేర్
— కాంగ్రెస్ కూటమి కంటే సుమారు 20శాతం ఓట్లు అధికంగా సాధించిన మహాయుతి
మరీ దారుణంగా 10-11శాతానికి పడిపోయిన కాంగ్రెస్ ఓట్ షేర్
ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా 20 కంటే తక్కువ స్థానాలు
2019తో పోల్చితే సగానికంటే ఎక్కువ సీట్లు కోల్పోయిన కాంగ్రెస్
2019లో కాంగ్రెస్‌కు 15.28శాతం ఓట్లు.. 44 స్థానాలు
జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి విజయానికి రెండు అంశాలు కలిసొచ్చాయి. జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి ఈ రెండు కూడా ఎన్నికల్లో బ్రహ్మాస్త్రాలుగా పనిచేశాయి. ఇందులో ఒకటి సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు రూ.2వేల 500 సాయంతో పాటు.. హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసింది. దీంతో.. జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 51 సీట్ల మెజార్టీ ఇచ్చారు జార్ఖండ్ ప్రజలు.
217 స్థానాల్లో ముందంజలో మహాయుతి కూటమి
మహారాష్ట్ర లో సొంతగా 122 స్థానాల్లో ముందంజలో భారతీయ జనతా పార్టీ
మహాయుతి కూటమిలో భాగంగా 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ
57 స్థానాల్లో ముందంజలో ఏక్ నాథ్ షిండే శివసేన
37 స్థానాల్లో ముందంజలో అజిత్ పవార్ ఎన్సీపీ
20 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్
18 స్థానాల్లో ముందంజలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే
10 స్థానాల్లో ముందంజలో శరద్ పవార్ ఎన్సీ
20 స్థానాల్లో ముందంజలో ఇతరులు
జార్ఖండ్‌లో చరిత్ర సృష్టించేందుకు హేమంత్ సోరెన్ దూసుకెళ్తుండగా, ఆయన భార్య కల్పనా సోరెన్ గండేయ అసెంబ్లీ స్థానంలో వెనుకబడ్డారు. కల్పన 4,593 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మునియా దేవి 16,943 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అధికారిక ఎన్నికల సంఘం డేటా ప్రకారం, JMM నేతృత్వంలోని మహా కూటమి జార్ఖండ్ రాష్ట్రంలో మెజారిటీ మార్కును దాటింది. ప్రస్తుతం 81 స్థానాలకు గానూ 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో తప్పు ఉందని ఆరోపించారు శివసేన (ఉద్దవ్ ఠాక్రే) నేత సంజయ్ రౌత్. ఇది ప్రజల అభిప్రాయం కాదని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. సింధు ద్వారా ఎమ్మెల్యేలందరూ ఎలా ఎన్నికయ్యారు? అంటూ ప్రశ్నించారు.
జార్ఖండ్‌లో జేఎంఎం కూటమికి మెజారిటీ వచ్చిన తర్వాత, రాంచీలో కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. జేఎంఎం కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో బీజేపీ కూటమి 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇప్పటి వరకు జరగనిది మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించగా, జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయాన్ని హేమంత్ సోరెన్ బ్రేక్ చేశారు. ముందుగా మహారాష్ట్ర గురించి చెప్పాలంటే, ఇక్కడ బీజేపీ ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ట్రెండ్స్ ప్రకారం 126 సీట్లో భారతీయ జనతా పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది. గతంలో 2014లో బీజేపీ 122 సీట్లు గెలుచుకుంది. 24 ఏళ్ల సంప్రదాయాన్ని తుంగలో తొక్కి జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్లకు గట్టి షాక్ తగిలిందని తెలుస్తోంది. పృథ్వీరాజ్ చవాన్ కరాద్ దక్షిణ్ నుండి వెనుకబడి ఉన్నారు. బాలాసాహెబ్ థోరట్, విజయ్ వాడెట్టివార్, యశోమతి ఠాకూర్, అమిత్ దేశ్‌ముఖ్ కూడా వెనుకబడ్డారు.
జార్ఖండ్‌లో ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌లో JMM అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేఎంఎం 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో బీజేపీ 24, కాంగ్రెస్ 12, ఆర్జేడీ 6, ఏజేఎస్‌యూ 2, సీపీఐ(ఎంఎల్) (ఎల్) 2, జేఎల్‌కేఎం 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
జార్ఖండ్‌లో 24 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి బ్రేక్‌పడింది. హేమంత్ సోరెన్ ట్రెండ్స్‌లో పునరాగమనం చేస్తున్నారు. 24 ఏళ్ల జార్ఖండ్ చరిత్రలో ఏ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎప్పుడూ జరగలేదు. అయితే ఈసారి రెండో దఫా హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం అధికారం దిశగా పరుగులు పెడుతోంది.
జల్నా జిల్లాలో బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ముందంజలో ఉండగా, షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన సంతోష్ దన్వే, బాబాన్‌రావ్ లోనికర్, నారాయణ్ కుచే ముందంజలో ఉన్నారు. షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన అర్జున్ ఖోట్కర్, హిక్మత్ ఉడాన్ ముందంజలో ఉన్నారు.
నటి స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ షాక్ తగిలింది. అనుశక్తి నగర్ నియోజకవర్గంలో నాలుగో రౌండ్‌లో నేషనలిస్ట్ అజిత్ పవార్ గ్రూపునకు చెందిన సనా మాలిక్ ముందంజలో ఉండగా, ఫహద్ అహ్మద్ వెనుకంజలో ఉన్నారు.
సనా మాలిక్ (అజిత్ పవార్ నేషనలిస్ట్ పార్టీ)-10,644 ఓట్లు
ఫహద్ అహ్మద్ (శరద్ చంద్ర పవార్ నేషనలిస్ట్ పార్టీ)- 9,253 ఓట్లు
ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయే 200 మార్కును దాటింది. 203 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ఎంవీఏ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగతా 13 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. జార్ఖండ్‌లో బీజేపీ కూటమి 32 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన పరాగ్ షా ముందంజలో ఉన్నారు.
పరాగ్ షా – భారతీయ జనతా పార్టీ – 12,601
రాఖీ జాదవ్ – NCP శరద్ పవార్ గ్రూప్ – 7,427
ఎంఎన్‌ఎస్‌కు చెందిన బాలా నంద్‌గావ్‌కర్ శివాడీ నియోజకవర్గంలో వెనుకబడ్డారు. ఠాక్రే గ్రూపునకు చెందిన అజయ్ చౌదరి ముందంజలో ఉన్నారు.
మహారాష్ట్ర:
NDA- 188
MVA-82
ఇతరులు-18
జార్ఖండ్:
బీజేపీ కూటమి 39
కాంగ్రెస్ కూటమి 41
ఇతరులు-1
ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయే 164 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగతా 16 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు.
జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం, బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. భారత కూటమికి మెజారిటీ వచ్చింది. భారత కూటమి 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఎన్డీయే 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఎన్డీయే 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అధిక్యం కనబరుస్తోంది. మహారాష్ట్రలోని మూడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్ కల్యాణ్. బల్లార్‌పూర్, కస్బాపేట్ నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించారు. పుణె కంటోన్మెంట్ పరిధిలో, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ రోడ్‌షోలో పాల్గొన్నారు పవన్‌కళ్యాణ్. పుణెతోపాటు బల్లార్‌పూర్, షోలాపూర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.
50శాతానికి పైగా ఓట్లతో దూసుకుపోతున్న మహాయుతి కూటమి
బీజేపీకి 23శాతానికి పైగా ఓట్ షేర్
షిండే శివసేనకు 13శాతం ఓట్ షేర్
అజిత్ పవార్ ఎన్సీపీకి 14శాతం ఓట్ షేర్
ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయే 164 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగతా 16 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. అదే సమయంలో జార్ఖండ్‌లో బీజేపీ కూటమి 37 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. రాజ్ థాకరే దీర్ఘకాలంగా ఉన్న అమిత్ థాకరే మహీమ్‌లో మూడవ స్థానంలో నిలిచారు. మహిలో ఠాక్రే గ్రూపునకు చెందిన మహేష్ సావంత్ ముందంజలో ఉన్నారు. షిండే గ్రూపునకు చెందిన సదా శరవంకర్ రెండో స్థానంలో ఉన్నారు.
విక్రోలి అసెంబ్లీ నియోజకవర్గంలో సునీల్ రౌత్ తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు.
సునీల్ రౌత్ – 3,800 ఓట్లు
సువర్ణ కరంజే – 2,712 ఓట్లు
విశ్వాజీ ధోలం – 915 ఓట్లు
నటి స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ అనుశక్తినగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఫహద్ అహ్మద్ ప్రస్తుతం లీడ్‌లో ఉండగా, అజిత్ పవార్ గ్రూప్‌నకు చెందిన సనా మాలిక్ తర్వాతి స్థానంలో ఉన్నారు.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం (ఉదయం 9.41), జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి ముందంజలో ఉంది.
బీజేపీ-7
కాంగ్రెస్-5
AJSUP-3
JMM-5
RJD-3
CPI(ML)(L)-2
JLKM-1
ఇతరులు – 1
మెజారిటీ ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. 153 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. ఎంవీఏ 114 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
జార్ఖండ్‌లో బీజేపీ కూటమి మెజారిటీకి చేరువైంది. ఎన్డీయే 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్-జేఎంఎం 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. జార్ఖండ్‌లో మెజారిటీ సంఖ్య 41.
మహిమ్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కొనసాగుతుండగా, ఎంఎన్‌ఎస్‌కు చెందిన అమిత్ థాకరేకు షాక్ తగిలింది. శివసేన షిండే గ్రూపునకు చెందిన సదా శరవంకర్ ముందంజలో ఉన్నారు.
అమిత్ థాకరే – 2 వేల 156 ఓట్లు
మహేష్ సావంత్ – 2 వేల 142 ఓట్లు
సదా శరవంకర్ – 2 వేల 270 ఓట్లు
జార్ఖండ్‌లో హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్-జేఎంఎం కూటమి ట్రెండ్స్‌లో ముందుకెళ్లింది. భారత కూటమి 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఎన్డీయే 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
— మహాయుతి, అఘాడీ మధ్య హోరాహోరీ
— గెలిచే అభ్యర్థులను పదిలం చేసుకునే పనిలో కాంగ్రెస్
— హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తరలింపు
— హోటల్స్ బుకింగ్ పనిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు
మన్‌ఖుర్డ్-శివాజీ నగర్ నియోజకవర్గంలో నవాబ్ మాలిక్‌కు షాక్ తగిలింది. తొలి రౌండ్ ఈవీఎం కౌంటింగ్‌లో అబూ అజ్మీకి 3,884 ఓట్లు రాగా, అతిక్ ఖాన్ (ఎంఐఎం)కి 3,617 ఓట్లు వచ్చాయి. నవాబ్ మాలిక్‌కు 461 ఓట్లు మాత్రమే రాగా, ఆయన మూడో స్థానానికి దిగజారారు.
మహారాష్ట్రలో విచిత్రం చోటుచేసుకుంటోంది. రెండు కూటమిలను కాదని స్వతంత్ర అభ్యర్థి అధిక్యంలోకి వచ్చారు. ఇండిపెండెంట్ రాజేంద్ర పాటిల్ యాద్రవర్ శిరోల్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆయనకు 6,700 ఓట్ల ఆధిక్యం లభించింది.
భుజబల్ కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. యెవాలాకు చెందిన ఛగన్ భుజబల్ వెనుకబడ్డాడు. కాగా అతని మేనల్లుడు సమీర్ భుజ్‌బల్ నంద్‌గావ్‌లో వెనుకబడ్డాడు. రెండో రౌండ్ ముగిసేసరికి షిండే గ్రూపునకు చెందిన సుహాస్ కాండే 8,200 ఓట్లతో ముందంజలో ఉన్నారు. దీంతో భుజ్‌బల్ కుటుంబంలో కలవరం మొదలైంది.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అద్భుతమైన రాజకీయ పోరాటాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ట్రెండ్స్‌లో ఎన్డీఏ 137 స్థానాల్లో, ఎంవీఏ 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా, జార్ఖండ్‌లో బీజేపీ కూటమి 36 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ పార్టీకి మెజారిటీ రాలేదు.
కోప్రి-పచ్‌పక్కడి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ముందంజలో ఉన్నారు.
నాగ్‌పూర్ నైరుతి నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ప్రఫుల్ గుడ్డే వెనుకబడ్డారు.
ఇందాపూర్ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ వర్గం అభ్యర్థి దత్తా భర్నే 336 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. శరద్ పవార్ వర్గం షాక్ అయ్యింది. హర్షవర్ధన్ పాటిల్ వెనుకబడిపోయారు.
రెండో రౌండ్ ముగిసే సమయానికి సతారా అసెంబ్లీ నియోజకవర్గంలో శివేంద్రరాజే భోసలే 8,613 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మహారాష్ట్రంలోని కంకావలి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నితీష్ రాణే 1,048 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
— మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రారంభమైన ఈవీఎల కౌంటింగ్
— మహారాష్ట్రలో 288 స్థానాలకు కౌంటింగ్
— జార్ఖండ్‌లో 81 స్థానాలకు కౌంటింగ్
మహారాష్ట్రలో 265 సీట్ల ట్రెండ్‌లో బీజేపీ కూటమి 132 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజ
బారామతి నుంచి అజిత్ పవార్ ముందంజలో ఉన్నారు
ఏకనాథ్ షిండే ముందంజలో ఉన్నారు
ఆదిత్య ఠాక్రే ముందున్నారు
చంపై సోరెన్ ముందంజలో ఉన్నారు
జార్ఖండ్‌లో గట్టిపోటీ నడుస్తోంది. గణాంకాలు వేగంగా మారుతున్నాయి. మొత్తం 81 స్థానాల్లో 62 స్థానాలకు ట్రెండ్‌లు వచ్చాయి.
ఇందులో బీజేపీ కూటమి 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్-జేఎంఎం కూటమి 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఒక సీటు మరోకరికి వెళుతున్నట్లు తెలుస్తోంది.
జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ సాగుతోంది. జార్ఖండ్‌లో 43 సీట్లకు తొలి ట్రెండ్‌లు వచ్చాయి. ఇందులో బీజేపీ కూటమి 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్-జేఎంఎం కూటమి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
— జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ
— 25 స్థానాల్లో ఎన్డీఏ లీడింగ్, 23 స్థానాల్లో యూపీఏ ముందంజ
— జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ
— 25 స్థానాల్లో ఎన్డీఏ లీడింగ్, 23 స్థానాల్లో
మాహిమ్‌లో పోస్టల్ కౌంటింగ్ ప్రారంభమై తొలి ట్రెండ్ వెలువడుతోంది. ఎంఎన్‌ఎస్‌కు చెందిన అమిత్ థాకరే ముందంజలో ఉన్నారు. మహిమ్‌లో అమిత్ ఠాక్రే, సదా శరవంకర్, మహేశ్ సావంత్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది.
లాతూర్ పోస్టల్ కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి ట్రెండ్ ముగిసింది. లాతూర్ సిటీలో అమిత్ దేశ్‌ముఖ్ పోస్టల్ రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. లాతూర్ రూరల్‌లో ధీరజ్ దేశ్‌ముఖ్ ముందంజలో ఉన్నారు.
కరాద్ దక్షిణ్ కౌంటింగ్ కేంద్రంలో అధికారు ప్రణాళికలో గందరగోళం నెలకొంది. దీంతో ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు.
ఔరంగాబాద్‌లో స్టాల్ కౌంటింగ్ ప్రారంభమై తొలి ట్రెండ్ అందుతోంది. ఔరంగాబాద్ తూర్పు నుంచి బీజేపీకి చెందిన అతుల్ సేవ్ ఆధిక్యంలో ఉండగా, ఔరంగాబాద్ పశ్చిమ నుంచి షిండేసేనకు చెందిన సంజయ్ శిర్సత్ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి షిండేసేనకు చెందిన ప్రదీప్ జైస్వాల్ ముందంజలో ఉన్నారు.
డోంబివిలిలో పోస్టల్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి ట్రెండ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీకి చెందిన రవీంద్ర చవాన్ ఆధిక్యంలో ఉండగా, దీపేష్ మహాత్రే వెనుకంజలో ఉన్నారు.
కాగల్‌లో పోస్టల్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ ఘాట్‌కి చెందిన సమర్జిత్ ఘాట్గే ముందంజలో ఉండగా హసన్ ముష్రిఫ్‌కు షాక్ తగిలింది.
వర్లీలో పోస్టల్ కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి ట్రెండ్ లో శివసేన ముందంజలో ఉంది. వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు.
బారామతి పోస్టల్ కౌంటింగ్ ప్రారంభమైంది. బారామతిలో పోస్టల్ ఓట్ల లెక్కింపులో యుగేంద్ర పవార్ ముందంజలో ఉన్నారు. అజిత్ పవార్ వెనుకబడ్డారు.
సకోలిలో పోస్టల్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి ట్రెండ్ వెలువడింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ముందంజలో ఉన్నారు.
సతారాలో పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ అభ్యర్థి శివేంద్ర రాజే భోంస్లే ముందంజలో ఉన్నారు. షోలాపూర్, నవీ ముంబైలలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
. మహారాష్ట్ర, జార్ఖండ్‌కు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, డాక్టర్ జి. పరమేశ్వరను మహారాష్ట్రకు ఏఐసీసీ పరిశీలకులుగా..తారిఖ్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవూరును జార్ఖండ్‌కు ఏఐసీసీ పరిశీలకులుగా నియమించారు
మహారాష్ట్రలో కౌంటింగ్‌కు ముందే క్యాంపు రాజకీయాలకు ప్లాన్ చేసింది మహా వికాస్ అఘాడి కూటమి. గెలిచినవారిని గెలిచినట్టు ఒకే ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది. తెలంగాణ లేదా కర్ణాటకలో క్యాంప్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 41 సీట్లు అవసరం. NDA కూటమిలోని బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ 2, లోక్‌జన్‌శక్తి ఒక స్థానంలో పోటీ చేశాయి. ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30 , ఆర్జేడీ 6, సీపీఐ (ఎంఎల్) 4 స్థానాల్లో పోటీ చేశాయి
మహాయుతి కూటమిలోని బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేయగా.. శివసేన షిండే 81, NCP అజిత్‌వర్గం 59 స్థానాల్లో బరిలోకి దిగాయి. మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ 101స్థానాల్లో పోటీ చేసింది. శివసేన యూబీటీ-95, ఎన్‌సీపీ ఎస్పీ 86 స్థానాల్లో పోటీ చేశాయి
మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288 ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ఫిగర్ 145 స్థానాలు. ఇక్కడ మహాయుతి- మహా వికాస్ అఘాడీల మధ్య హోరా హోరీగా పోరు సాగింది. ఎవరికి వారే విజయంపై ధీమాగా ఉన్నారు
కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.నిఖీలను ముమ్మరం చేశారు.
మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను తెరుస్తారు అధికారులు.
మహారాష్ట్ర వ్యాప్తంగా 288 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ముంబైలో 36 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అటు జార్ఖండ్‌లో మొత్తం 81 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కౌంటింగ్ మొదలైంది. 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది. మధ్యాహ్నంకలా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది
మహారాష్ట్రలో ఈసారి 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 96,654 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముంబై Vనగరంలోని మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాలకు 300 మీటర్ల పరిధిలో ఆంక్షలు నిషేధిస్తూ ముంబై పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు
మహాకూటమిలో భారతీయ జనతా పార్టీ 149 అసెంబ్లీ స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101 మంది, శివసేన (ఉబాత) 95, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) 86 మంది అభ్యర్థులను నిలబెట్టాయి.