Haryana Elections 2024: వినేష్ ఫోగట్ విజయం.. బ్రిజ్ భూషణ్ సింగ్ రియాక్షన్

|

Oct 08, 2024 | 7:07 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నాయకురాలు వినేష్ ఫోగట్ విజయంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమె గెలిచింది, కానీ పార్టీ ఓడిపోయిందని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్, ఆమె ఎక్కడికి వెళ్లినా విధ్వంసం వ్యాప్తి చేస్తుందని చెప్పాడు.

Haryana Elections 2024: వినేష్ ఫోగట్ విజయం.. బ్రిజ్ భూషణ్ సింగ్ రియాక్షన్
Brij Bhushan's On Vinesh Ph
Follow us on

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నాయకురాలు వినేష్ ఫోగట్ విజయంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమె గెలిచింది, కానీ పార్టీ ఓడిపోయిందని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్, ఆమె ఎక్కడికి వెళ్లినా విధ్వంసం వ్యాప్తి చేస్తుందని చెప్పాడు. ఎన్నికల్లో కొందర బీజేపీ అవకాశాలను దెబ్బతీయాలని చూశారని పేర్కొన్నారు. జాట్’ మెజారిటీ స్థానాల్లో చాలా మంది బీజేపీ అభ్యర్థులే గెలుపొందారని పేర్కొన్నారు.

“చాలా మంది బీజేపీ అభ్యర్థులు ‘జాట్’ మెజారిటీ సీట్లపై గెలిచారు. రెజ్లర్ల ఆందోళనలో రెజ్లర్లు అని పిలవబడే వారు హర్యానాకు చెందిన హీరోలు కాదు. జూనియర్ రెజ్లర్లందరికీ కూడా వారు విలన్లు.. ఆమె (వినీష్ ఫోగట్) నా పేరును ఎన్నికల్లో గెలువడానికి ఉపయోగించింది, ఆమె గెలిచింది, కానీ కాంగ్రెస్ ఓడిపోయింది… ‘వో జహాన్ జహాన్ జైగీ, సత్యనాష్ హాయ్ హోగా’ అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా, జులనా నియోజకవర్గం నుంచి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ తన విజయం “ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ యొక్క పోరాటానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఉద్ఘాటించారు. అయితే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిత్ పోల్స్ వెల్లడించాయి. కానీ అనూహ్యంగా వారి అంచనాలు అన్ని బీజేపీ తలకిందులు చేసింది. హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి పోయింది.