24 గంటల్లో 68,829 పరీక్షలు.. 7,553 కేసులు..

ఒక్కరోజులో 68,829 నమూనాలను పరీక్షించగా 7,553 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,39,302కి చేరింది. సోమవారం సాయంత్రం నుంచి…

  • Sanjay Kasula
  • Publish Date - 6:54 pm, Tue, 22 September 20

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గతంలో కంటే తగ్గింది. ఒక్కరోజులో 68,829 నమూనాలను పరీక్షించగా 7,553 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,39,302కి చేరింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం 24 గంటల వ్యవధిలో 51 మంది చికిత్స పొందుతూ మృతిచెందారు.

చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురం 6, విశాఖపట్నం 6, కృష్ణా 5, ప్రకాశం 5, తూర్పుగోదావరి 4, కర్నూలు 4, గుంటూరు 3, కడప 3, నెల్లూరు 3, పశ్చిమగోదావరి 3, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,461కి చేరింది. ఒక్కరోజులో 10,555 మంది పూర్తిగా కోలుకోగా.. 71,465 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 52,29,529 నమూనాలను పరీక్షించారు.