ఇళ్ల స్థలాల అంశం.. మనస్తాపం చెంది గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం..

| Edited By:

Jul 01, 2020 | 3:54 PM

ఇళ్ల స్థలాల్లో అవకతవకల కారణంగా ఓ మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. తస్‌పున్నీసా అనే గ్రామ వాలంటీర్ ఎమ్మార్వో ఆఫీసు పై నుంచి..

ఇళ్ల స్థలాల అంశం.. మనస్తాపం చెంది గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం..
Follow us on

ఇళ్ల స్థలాల్లో అవకతవకల కారణంగా ఓ మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. తస్‌పున్నీసా అనే గ్రామ వాలంటీర్ ఎమ్మార్వో ఆఫీసు పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానికులు బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలు తస్‌పున్సీసా బి కొత్తకోట బీసీ కాలనీలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం, ఇటు లబ్ధిదారులు ప్రశ్నిస్తుండటంతో మనస్తాపానికి గురైన గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబీకులు చెబుతున్నారు.

Read More: 

ఆ షూటింగ్ చివరి రోజే మహేష్‌ని ప్రేమిస్తున్నానని అర్థమైంది..

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..

108 ఉద్యోగులకు సీఎం జగన్ వరం.. భారీగా జీతాలు పెంపు