జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్‌.. పోలీసులకు ఫిర్యాదు

| Edited By:

Oct 09, 2020 | 10:19 AM

సినీ నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్ర కుమార్‌కి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఆయనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో యుగేంద్ర బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్‌.. పోలీసులకు ఫిర్యాదు
Follow us on

Jagapathi Babu brother: సినీ నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్ర కుమార్‌కి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఆయనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో యుగేంద్ర బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గుట్టల బేగంపేట స్తలం విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి ఈ కాల్స్ వచ్చాయని యుగేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు తన కుమారుడిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఆయన పోలీసులకు చెప్పారు. ఈ ఫోన్‌ కాల్స్ వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజరెడ్డి ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ స్థలంలో ఆటంకాలు సృష్టించడంతో పాటు కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని అంతేకాకుండా రూ.2కోట్లు డిమాండ్ చేశారని యుగేంద్ర తెలిపారు. జగపతిబాబు పేరును కూడా ఇందులోకి లాగుతూ కించపరుస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ఇక యుగేంద్ర ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Read More:

Bigg Boss 4: ప్రతిసారీ గంగవ్వ నిర్ణయమేనా.. సొహైల్ అసంతృప్తి

నేడు తెలంగాణలో‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు