Crime News: అమానుష ఘటన.. రేపిస్టుతో యువతిని కట్టేసి ఊరేగిస్తూ నినాదాలు.! ఎక్కడంటే.!!

|

Mar 29, 2021 | 1:09 PM

Crime News Latest: లైంగిక వేధింపులు ఎదుర్కున్న వారిని రక్షించించాల్సింది పోయి.. అత్యాచారం చేసినవాడితో కట్టేసి ఊరంతా తిప్పారు కొంతమంది ప్రబుద్దులు..

Crime News: అమానుష ఘటన.. రేపిస్టుతో యువతిని కట్టేసి ఊరేగిస్తూ నినాదాలు.! ఎక్కడంటే.!!
Rape Saviour
Follow us on

Crime News Latest: లైంగిక వేధింపులు ఎదుర్కున్న వారిని రక్షించించాల్సింది పోయి.. అత్యాచారం చేసినవాడితో కట్టేసి ఊరంతా తిప్పారు కొంతమంది ప్రబుద్దులు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

భోపాల్‌లోని ఓ గిరిజనలు అధికంగా నివసించే ప్రాంతంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ నిందితుడిని పోలీసులకు పట్టించాల్సింది పోయి.. అక్కడ ఉండే కొంతమంది వ్యక్తులు.. అతడ్ని, ఆ మైనర్ బాలికను కట్టేసి, నినాదాలు చేస్తూ ఊరంతా తిప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసులు రంగంలోకి దిగి నిందితుడితో పాటు మరో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో క్లిప్‌లో ” భారత్ మాతా కి జై” అని కొంతమంది వ్యక్తులు నినాదాలు చేయడంతో పాటు సదరు యువతిని నిందితుడితో పాటు తిప్పినట్లుగా కనిపిస్తుంది. భోపాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన ఆదివారం జరిగింది.

ఇక ఆమెను అలా నిందితుడితో ఊరంతా నడిపించడంలో సదరు యువతి కుటుంబసభ్యుల ప్రోద్భలం కూడా ఉందని సమాచారం. పోలీసులు సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకొని యువతిని రక్షించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై, యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులపై కేసులు పెట్టి విచారిస్తున్నామని అక్కడి పోలీస్ అధికారి దిలీప్ సింగ్ బిల్వాల్ వెల్లడించారు.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!