చికెన్ కూర పెట్టలేదని.. క్వారంటైన్‌లో ఆశా వర్కర్‌పై దాడి..!

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 5:55 PM

కోడి కూర పెట్టలేదన్న కోపంతో క్వారంటైన్‌ సెంటర్‌లో ఓ ఆశా వర్కర్‌పై దాడి చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో ఆమె చేయి విరిగిపోయింది.

చికెన్ కూర పెట్టలేదని.. క్వారంటైన్‌లో ఆశా వర్కర్‌పై దాడి..!
Follow us on

కోడి కూర పెట్టలేదన్న కోపంతో క్వారంటైన్‌ సెంటర్‌లో ఓ ఆశా వర్కర్‌పై దాడి చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో ఆమె చేయి విరిగిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల మహారాష్ట్ర నుంచి కలబురగి జిల్లాకు వచ్చిన కొంత మందిని అలంద్ తాలూకాలోని కిన్ని అబ్బాస్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. వారిలో సోమనాథ అనే వ్యక్తి కుటుంబం కూడా ఉంది.

ఈ క్రమంలో శనివారం రాత్రి సమయంలో సోమనాథ తనకు చికెన్ కావాలని ఆశా కార్యకర్త రేణుకాను డిమాండ్ చేశాడు. అలాగే తన భార్యకు చేపల కూర, పిల్లలకు చిప్స్ కావాలని డిమాండ్ చేశాడు. అయితే అందుకు తిరస్కరించిన రేణుక, ఉన్నతాధికారులు సూచించిన భోజనాన్నే అందజేస్తామని చెప్పారు. కోడి కూర పెట్టించే విషయంపై అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని నచ్చజెప్పారు. అయితే ఆమె మాటలను వినిపించుకోని సోమనాథ.. తీవ్ర ఆగ్రహానికి గురై రేణుకపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ఎడమ చేయి విరగ్గా.. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సోమనాథపై కేసు నమోదు చేశారు. క్వారంటైన్‌ తరువాత అతడిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

Read This Story Also: చిరు సూచనలు.. మళ్లీ పనిలో పడ్డ యంగ్ డైరెక్టర్..!