చిరు సూచనలు.. మళ్లీ పనిలో పడ్డ యంగ్ డైరెక్టర్..!

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత పలువురు డైరెక్టర్‌లను లైన్‌లో పెట్టుకున్నారు.

చిరు సూచనలు.. మళ్లీ పనిలో పడ్డ యంగ్ డైరెక్టర్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 5:06 PM

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత పలువురు డైరెక్టర్‌లను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ముందు వరుసలో ఉన్న దర్శకులు సుజీత్, బాబీ. వీరిలో సుజీత్‌కి లూసిఫర్ రీమేక్ బాధ్యతలు అప్పగించారు చిరు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సుజీత్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మెగాస్టార్. ఇదిలా ఉంటే లూసిఫర్ తెలుగు స్క్రిప్ట్‌ను చిరు ఇమేజ్‌కి తగ్గట్లుగా‌ తయారు చేసుకున్న సుజీత్.. ఇటీవల దాన్ని చిరుకు వినిపించారట. అయితే అందులో కొన్ని భాగాలు చిరుకు పెద్దగా నచ్చలేదట. అందుకే మళ్లీ స్క్రిప్ట్‌ను తయారు చేయమని సుజీత్‌కి చెప్పారట. దీంతో ఈ దర్శకుడు మళ్లీ పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో కీలక పాత్రల కోసం విజయశాంతి, జెనీలియాలను సంప్రదిస్తున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తుండగా.. స్క్రిప్ట్ పూర్తైన తరువాతే నటీనటుల ఎంపిక ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుజీత్ స్క్రిప్ట్‌కి చిరు నుంచి మార్కులు పడితే, ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు టాక్. కాగా ఈ రీమేక్‌ని కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే.

Read This Story Also: ‘పుష్ప’ కోసం బన్నీ మరో కీలక నిర్ణయం..!

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..