Maharashtra: పానీపూరీ తీసుకువచ్చిన భర్త.. ఆగ్రహంతో ఆత్మహత్య చేసుకున్న భార్య..

| Edited By: Ravi Kiran

Sep 01, 2021 | 6:27 AM

Maharashtra: పానీ పూరి.. ఓ మహిళ ప్రాణాలు తీసేసింది. భర్త తనను అడగకుండా పానీపూరీ తీసుకువచ్చినందుకు ఆగ్రహించిన భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

Maharashtra: పానీపూరీ తీసుకువచ్చిన భర్త.. ఆగ్రహంతో ఆత్మహత్య చేసుకున్న భార్య..
Suicide
Follow us on

Maharashtra: పానీ పూరి.. ఓ మహిళ ప్రాణాలు తీసేసింది. భర్త తనను అడగకుండా పానీపూరీ తీసుకువచ్చినందుకు ఆగ్రహించిన భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. షోలాపూర్‌కు చెందిన గహినీనాథ్ సర్వదేకి, ప్రతీక్ష అనే మహిళకు 2019లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాయి. గహినీనాథ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, వివాహం జరిగినప్పటి నుంచి గహినీనాథ్, ప్రతీక్ష మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకునేవి. అయితే, ఈ దంపతులు కొన్నాళ్ల క్రితం పూణెకి వచ్చి స్థిరపడ్డారు. అంబేగావ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో గహినీనాథ్ రోజూలాగే ఆఫీస్‌కు వెళ్లాడు. అలా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా.. భార్యా, పిల్లల కోసం పానీ పూరిని పార్సల్ తీసుకువచ్చాడు. అయితే, తనకు చెప్పకుండా పానీపూరి తేవడంపై ప్రతీక్ష ఆగ్రహం వ్యక్తం చేసింది. పానీ పూరీ ఎందుకు తీసుకువచ్చావంటూ గహినీనాథ్‌తో ఘర్షణకు దిగింది. పానీపూరి తినడానికి ప్రతీక్ష నిరాకరించింది. ఆ రోజు అలా గడిచిపోగా. మరుసటి రోజు గహినినాథ్ ఆఫీస్‌కు వెళ్తుండగా.. టిఫిన్ బాక్స్ ఇవ్వలేదు ప్రతీక్ష. ఇంకా ఆగ్రహంతో రగిలిపోతోన్న ప్రతీక్ష.. అతను డ్యూటీకి వెళ్లగానే విషం తాగింది. అది గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రతీక్ష ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై భారతి విద్యాపీఠ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త గహినీనాథ్ సర్వదేను అరెస్ట్ చేశారు.

కొడుకు కోసం నోట్లో నిప్పుల కుంపటి..
పూణెకు చెందిన ఓ భార్యాభర్తలకు సంబంధించి షాకింగ్ వార్త వైరల్ అవుతోంది. కొడుకు ఓ వ్యక్తి తన భార్యను ఫేక్ బాబా వద్దకు తీసుకెళ్లాడు. ఆ దొంగ బాబా కాస్తా.. మహిళను అగ్నిగుండం నుంచి నడిపపించాడు. ఇంటికి వెళ్లాక భార్యను నగ్నంగా ఉంచి.. ఎర్రగా కాలుతున్న నిప్పు కణికను ఆమె నోట్లో ఉంచాలని ఆ దొంగ బాబా మహిళ భర్తకు చెప్పాడు. దాంతో ఇంటికి వచ్చిన ఆ భర్త.. తన భార్యను నగ్నంగా చేసి నోట్లో నిప్పు కణికన పెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. మహిళ అత్తమామను అదుపులోకి తీసుకోగా.. భర్త పరారీలో ఉన్నాడు.

Also read:

Capricorn: మకర రాశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియన ఆసక్తికరమైన విషయాలు.. మీకోసం..

Covid 19 Vaccine: వ్యాక్సినేషన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ఒక్క రోజులో కోటీ 30 లక్షలకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ..

భర్త పుట్టినరోజుకు సర్ ప్రైస్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..:AP Deputy CM pPushpa Sreevani Photos.