Tunnel Prostitution: లాడ్జిలోని సొరంగంలో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం.. సోదాల్లో విషయం తెలిసి పోలీసుల ఫ్యూజులు ఔట్!

సాధారణంగా టన్నెల్స్‌ ఎందుకు ఏర్పాటు చేస్తారు? షార్ట్‌ కట్‌ రూట్‌ కోసం లేదంటే.. రవాణా సౌలభ్యం కోసమో ఏర్పాటు చేస్తారు. కానీ కర్నాటకలో ఏర్పాటు చేసిన ఓ టన్నెల్‌ సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది.

Tunnel Prostitution: లాడ్జిలోని సొరంగంలో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం.. సోదాల్లో విషయం తెలిసి పోలీసుల ఫ్యూజులు ఔట్!
Tunnel Prostitution

Updated on: Sep 22, 2021 | 12:33 PM

Police bust Prostitution Racket: సాధారణంగా టన్నెల్స్‌ ఎందుకు ఏర్పాటు చేస్తారు? షార్ట్‌ కట్‌ రూట్‌ కోసం లేదంటే.. రవాణా సౌలభ్యం కోసమో ఏర్పాటు చేస్తారు. కానీ కర్నాటకలో ఏర్పాటు చేసిన ఓ టన్నెల్‌ సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. నాలుగు గోడల మధ్య సొరంగాన్ని తవ్విన తీరు చూసి ఖాకీలు అవాక్కయ్యారు.

కర్నాటకలోని తుముకూరు సమీపంలోని జాతీయ రహదారి ఇది. రయ్‌ రయ్‌ మంటూ వాహనాలు దూసుకెళ్లే ఈ హైవేపై ఉన్నట్టుండి కండోమ్స్‌ కలకలం రేపాయి. కుప్పలు తెప్పలుగా.. గుట్టలు గుట్టలుగా కండోమ్స్‌ చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. ఆనోటా ఈనోటా సమాచారం అందుకున్న పోలీసులు.. కండోమ్స్ కథా చిత్రమ్‌పై నజర్‌ పెట్టారు. చుట్టుపక్కల ఇళ్లేవి లేవు.. అయినా ఇవి ఇక్కడి కండోమ్స్‌ ఎలా వచ్చాయని బేజా ఫ్రై చేసుకున్నారు పోలీసులు. ఇవీ ఇక్కడికి ఎలా వచ్చయన్న దానిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

పోలీసుల విచారణలో భాగంగా సమీపంలో ఉన్న నంది డీలక్స్‌ లాడ్జి దగ్గర పోలీసులు ఆగిపోయారు. లోపలికి వెళ్లి షరామూమూలుగానే లాడ్జి సిబ్బందిని ప్రశ్నించారు. వాళ్లపై అనుమానం రావడంతో తమదైన స్టయిల్‌లో ప్రశ్నించారు. దీంతో లాడ్జీలో వయా టన్నెల్‌ డర్టీ పిక్చర్‌ బయటపడింది. పైకి నీట్‌గా కనిపిస్తున్న ఈలాడ్జీలో సొరంగంలో వ్యభిచారం బాగోతం బయటపడింది. దీంతో అడ్డుపెట్టిన టేబుల్ చక్కలను తొలగించి చూస్తే.. ఓ జంట మెల్లగా పాక్కుంటూ బయటపడింది. వారిద్దరితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా సొరంగాన్ని తవ్వారు. ఆ మార్గంలో అమ్మాయిలను లాడ్జీలోకి తీసుకొచ్చి పక్కా దందా చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఇదంతా గుట్టుగానే సాగింది. అయితే, వాడేసిన కండోమ్స్‌ పెరిగిపోవడంతో వాటన్నింటిని తీసుకొచ్చి రహదారిపై పడేశారు. ఎవరి పాపం వారికే చుట్టుకుంటుంది అన్నట్టుగా.. చేయి దులుపుకోవాలని చూసిన నిర్వాహకులు వాళ్లు చేసిన నిర్వాకంతో అడ్డంగా బుక్కయ్యారు. మొత్తానికి సొరంగంలో వ్యభిచారం సీన్‌ లాడ్జీ నిర్వాహుకుల్ని సితార్ చేసింది.

Read Also…  Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ అధికార నివాసంపై దాడి కేసులో పురోగతి.. ఐదుగురు నిందితుల అరెస్ట్!

Loading...
Unable to load recommendations.
Follow Us