Fact Check: ఉచితంగా విమానం టికెట్లు అంటూ లింక్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో మీ పని గోవిందా..

|

Aug 12, 2022 | 4:24 PM

Fact Check: సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి రోజుకో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా ఉచితం పేరుతో...

Fact Check: ఉచితంగా విమానం టికెట్లు అంటూ లింక్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో మీ పని గోవిందా..
Follow us on

Fact Check: సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి రోజుకో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా ఉచితం పేరుతో ప్రజలను వల వేసుకుంటూ బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. ఉచితంగా విమాన టికెట్లను సొంతం చేసుకునే అవకాశం అంటూ ఫోన్లలోని సమాచారమంతా కొట్టేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ పేరుతో ఓ లింక్‌ వాట్సాప్‌లో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే వెంటనే క్విజ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగానే యూరప్‌ రౌండ్‌ ట్రిప్‌ టెకెట్లు గెలుచుకున్నారని, ఈ క్విజ్‌ను ఇతర వాట్సాప్‌ గ్రూప్సలో షేర్‌ చేయాలని అడుగుతుంది. అయితే అంతలోనే సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌లోని డేటాను మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతిలో వెళ్లిపోతుంది. మాల్వేర్‌ ద్వారా నేరగాళ్లు ఫోన్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. లింక్‌ ప్రివ్యూ, పేజీ ఓపెన్‌ అయిన తర్వాత కూడా అచ్చంగా ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ను పోలి ఉండడంతో యూజర్లు ఎలాంటి సందేహం లేకుండా క్లిక్‌ చేస్తున్నారు.

ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లింక్‌లు ఏవైనా కనిపిస్తే వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సమాచారం సరైందేనా అని క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని చెబుతున్నారు. కొన్నిసార్లు ఇలాంటి లింక్‌లు ఖాతాల్లోని డబ్బులను సైతం దోచేస్తాయిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..