చిత్తూరు జిల్లాలో మహిళల పొదుపు రుణాలు కాజేసిన అధికారులు, సిబ్బంది. దాదాపు రెండు కోట్ల రూపాయలపైనే స్వాహా.. !

|

Mar 28, 2021 | 9:03 PM

Officers and staff cheating : పొదుపు మహిళల నిధులను పక్కదారి పట్టించారు. గ్రామైక్య సంఘాల లీడర్లు, అధికారులు కుమ్మక్కై.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారని ఆరోపిస్తూ.. బాధిత మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం

చిత్తూరు జిల్లాలో మహిళల పొదుపు రుణాలు కాజేసిన అధికారులు, సిబ్బంది. దాదాపు రెండు కోట్ల రూపాయలపైనే స్వాహా.. !
Chittoor Officials Cheating
Follow us on

Officers and staff cheating : పొదుపు మహిళల నిధులను పక్కదారి పట్టించారు. గ్రామైక్య సంఘాల లీడర్లు, అధికారులు కుమ్మక్కై.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారని ఆరోపిస్తూ.. బాధిత మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్‌ మండలంలో వెలుగు చూసింది. గత కొన్నేళ్లుగా మహిళల పొదుపు సొమ్మును ఆడిట్ చేయంచకుండా నాటకాలాడుతూ అధికారులు, సిబ్బంది సంఘాల లీడర్లు కాజేసినట్లుగా మహిళలు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. నిధుల గోల్ మాల్ పై ఎన్ ఆర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యంతో యంత్రాంగం కదిలింది. ముమ్మర దర్యాప్తు మొదలుపెట్టారు. తాలంబేడుతో పాటు మరో 6 గ్రామాల్లోని 36 పొదుపు సంఘాలకు చెందిన నిధులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. పొదుపు సొమ్మును బ్యాంక్ లో డిపాజిట్ చేయకుండా ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రశీదులతో మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. చిత్తూరు రూరల్ మండలం పొదుపు సంఘాల ఏపియం, సిసి, సంఘ మిత్రాల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read also : Khushboo promises : ప్రతీ ఆడపిల్లకీ లక్ష డిపాజిట్ చేస్తా.. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో వెలుగులు విరజిమ్ముతోన్న సినీనటి ఖుష్భూ