ఆ ఫలకం ఇంట్లో ఉంటే ధనవంతులవుతారట.. గ్యాంగ్ గారడీ.. పోలీసులు అదుపులో కిలాడీలు

|

Jan 12, 2021 | 8:27 PM

పురాతన వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులవుతారట. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో తులతూగురాట. ఇలా చెప్పి..అమాయకుల్ని మోసం చేయడానికి ఓ గ్యాంగ్ సిద్దమైంది.

ఆ ఫలకం ఇంట్లో ఉంటే ధనవంతులవుతారట.. గ్యాంగ్ గారడీ.. పోలీసులు అదుపులో కిలాడీలు
Follow us on

పురాతన వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులవుతారట. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో తులతూగురాట. ఇలా చెప్పి..అమాయకుల్ని మోసం చేయడానికి ఓ గ్యాంగ్ సిద్దమైంది. కానీ డ్యామిట్ కథ అడ్డం తిరిగి పోలీసుల ఎంట్రీతో సీన్ మారిపోయింది. అడ్డంగా బుక్ అయ్యారు కేటుగాళ్లు.

వివరాల్లోకి వెళ్తే..  శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం నీలంపేటకు చెందిన యజ్జల చిరంజీవి పెయింటింగ్‌ పనులు నిర్వహిస్తున్నాడు. అతడికి మూడునెలల క్రితం ఒడిశాలోని కాశీనగర్‌ ప్రాంతానికి చెందిన కరణం సంపతిరావు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన దగ్గర మైసూర్‌ మహారాజు ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఒప్పంద చేసుకున్న పురాతన రాగి ఫలకం ఉందని.. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులవుతారని నమ్మించాడు. దాన్ని అమ్మి సొమ్ము చేసుకుందామని సంపతిరావు చిరంజీవితో చెప్పాడు.

వీరితో పాటు ఒడిశాకు చెందిన అసయ్‌ మండల్‌, తిమ్మక్క బొల్లొ, శ్రీకాకుళంకు చెందిన అప్పలస్వామి, సారవకోటకు చెందిన గొర్లె శ్రీనివాసరావు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి విశాఖకు చెందిని ఓ వ్యక్తికి 3 లక్షలకు ఈ ఫలకాన్ని విక్రయించేందుకు సిద్ధపడ్డారు. టెక్కలి బస్టాండ్‌లో ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోటబొమ్మాళి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు.

Also Read:

ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్​ చైర్మన్​గా పునూరు గౌతమ్​రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆటోకి అతికించిన సత్యసాయి చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి.. సాయి మహిమే అంటున్న భక్తులు

Bowenpally Kidnap Case: కిడ్నాప్ కేసులో మరో సంచలన ట్విస్ట్.. జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు

Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున