Crime News: ఘోరం.. మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని.. స్నేహితుడిని దారుణంగా చంపారు.. చివరకు..

|

Oct 28, 2021 | 1:53 PM

Friends killed man: ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం తాగేందుకు బార్‌కు వెళ్లారు. ఈ క్రమంలో రూ.10 తక్కువ కావడంతో.. ఇవ్వాలంటూ ఇద్దరు కలిసి.. మరో స్నేహితుడిని

Crime News: ఘోరం.. మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని.. స్నేహితుడిని దారుణంగా చంపారు.. చివరకు..
Crime News
Follow us on

Friends killed man: ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం తాగేందుకు బార్‌కు వెళ్లారు. ఈ క్రమంలో రూ.10 తక్కువ కావడంతో.. ఇవ్వాలంటూ ఇద్దరు కలిసి.. మరో స్నేహితుడిని అడిగారు. అతను పది రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించాడు.. దీంతో ఇద్దరు స్నేహితులు కలిసి.. మరో స్నేహితుడిని దారుణంగా చంపారు. కర్రతో తలపై కొట్టి హత్యచేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుల్దానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భగవత్ సీతారామ ఫసే (50) తన స్నేహితులైన వినోద్ వాంఖడే, దిలీప్‌లతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లాడు.

ఈ సమయంలో వినోద్, దిలీప్ భగవత్ రూ.10 ఇవ్వాలని భగవత్‌ను కోరారు. అయితే.. భగవత్ తన దగ్గర లేవంటూ రూ.10 ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో మరో ఇద్దరు స్నేహితులు వినోద్, దిలీప్ కోపంతో రగలిపోయారు. భగవత్.. బార్ నుంచి బయటకు వస్తుండగా.. నిందితులు వెనుక నుంచి కర్రతో తలపై దాడి చేశారు. దీంతో తీవ్రగాయంతో కుప్పకులిన భగవత్ సీతారాం ఫసే.. అక్కడికక్కడే మరణించాడు. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న భగవత్‌ను చూసి బార్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పారిపోయిన నిందితులను గంటలోపే అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి ప్రహ్లాద్ కట్కర్ తెలిపారు. భగవత్‌ తలకు తీవ్రగాయమైందని.. దీంతో అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న భగవత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. అర్ధరాత్రి యువ‌తి ఇంటికెళ్లి ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తితో దాడి..

IND vs PAK Match: పాకిస్తాన్ విజ‌యంపై సంబరాలు.. ముగ్గురు కాశ్మీరి విద్యార్థుల అరెస్ట్.. 

Amit Shah: అవసరమైతే నాకు ఫోన్ చేయండి.. కాశ్మీర్‌లో సాధారణ పౌరుడికి ఫోన్ నెంబర్ ఇచ్చిన అమిత్ షా