Chain Snatcher: సడెన్ ట్విస్ట్.. ఖతర్నాక్ చైన్ స్నాచర్ ఉమేష్‌ ఖతిక్ ఎస్కేప్

|

Feb 09, 2022 | 9:07 AM

Crime News:హైదరాబాద్ పోలీసులు పక్కా ఆధారాలతో సమాచారం ఇవ్వడంతో అహ్మదాబాద్‌ పోలీసులకు చిక్కాడు ఉమేష్‌ ఖతిక్. అంతలా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ ఉమేష్ ఖతిక్ ఎస్కేప్ అవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Chain Snatcher: సడెన్ ట్విస్ట్.. ఖతర్నాక్ చైన్ స్నాచర్ ఉమేష్‌ ఖతిక్ ఎస్కేప్
Chain Snatcher Umesh Kathik
Follow us on

Umesh khatik: ఉమేష్‌ ఖతిక్ పరారయ్యాడు. హైదరాబాద్(hyderabad)లో వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడిన దొంగ అతను. స్నాచింగ్‌ల తర్వాత సొంత ఊరు గుజరాత్ అహ్మదాబాద్‌కు పారిపోయాడు. హైదరాబాద్‌ పోలీసులు అక్కడ అతన్ని గుర్తించినా.. గుజరాత్ పోలీసులు కూడా మోస్ట్ వాటెండ్ అని అతన్ని తెలంగాణ పోలీసులకు అప్పగించలేదు. పోనీ వాళ్లయినా అతన్ని కటకటాల వెనక్కి నెట్టారా అంటే.. పారిపోయేంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. గత నెలలో ఒకేరోజు హైదరాబాద్‌లో 6 చోట్ల స్నాచింగ్ చేసిన ఉమేష్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకురావాలని మన పోలీసులు భావించినా అహ్మదాబాద్ పోలీసులు(Ahmedabad police) అప్పగించలేదు. సరికదా.. ఇప్పుడు అతను అక్కడి పోలీసుల నుంచి కూడా పరారయ్యాడు. అతని పరారీపై తెలంగాణ పోలీసులకు అనేక అనుమానాలున్నాయి.

100కు పైగా గొలుసు చోరీలు…

గొలుసు దొంగతనాలలో ఆరితేరిన వ్యక్తి.. ఉమేష్‌ ఖతిక్‌. ఇతడిది అహ్మదాబాద్‌. మంచినీళ్లు తాగినంత ఈజీగా చైన్ స్నాచింగ్ చేసేస్తాడు. వివిధ రాష్ట్రాల్లో 100కు పైగా గొలుసు చోరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. మైనర్‌గా ఉన్నప్పుడే ఈ దారిని ఎంచుకున్నాడు. జైలుకెళ్లినా బుద్ది మారలేదు. బయటకు వచ్చాక వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసిరాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఇతడి పేరు ఉమేష్‌ అలియాస్‌ లాలో గులాబ్జీ ఖతిక్‌. రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా ఉమేష్‌ ఖతిక్‌పై కేసులున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని ఇంట్రాగేట్ చేసేందుకు సిద్దమవుతుండగా.. అతడు ఎస్కేప్ అయ్యాడన్న వార్త పలు అనుమానాలకు తావిస్తోంది.

Also Read: Telangana: అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్.. బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది