అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయంలో దొంగలుపడ్డారు.. ఇంతకీ ఏం పోయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

|

Jan 22, 2021 | 4:15 PM

ఇటీవల వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయంలో దొంగలుపడ్డారు.. ఇంతకీ ఏం పోయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Follow us on

Temple Hair theft : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు అలజడి రేపుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. పోలీసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవల వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహాల ధ్వంసం, సింహ ప్రతిమల మాయం, హుండీల్లో చోరీ, గుప్త నిధుల కోసం ఆలయాల్లో తవ్వకాలు ఇలా ఏది తీసుకున్నా.. సీరియస్‌గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా అప్పన్నపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయంలో జరిగిన ఘటన.. స్థానిక పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.ఇంతకీ ఇతను దొంగతనం చేసింది బంగారమా.. దేవుడి విగ్రహాలా.. హుండీలో సొమ్మా.. ? ఇదేమీ కాదు.. జట్టు. ఆలయ పరిభాషలో చెప్పాలంటే తలనీలాలు. వినడానికి వింతగా అనిపించినా.. ఓ దొంగ తలనీలాలను ఎత్తుకెళ్లాడు. భక్తులు ఎంతో పవిత్రంగా సమర్పించే తలనీలాలు.. ఎత్తుకెళ్లడం తీవ్ర దుమారం రేపుతోంది. ఓ గదిలో ఉన్న 20 కేజీల జుట్టును ఓ బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్లాడు అగంతకుడు. ఈ వ్యవహారం అంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో… దొంగతనం వెలుగుచూసింది.

ముఖానికి మాస్క్‌ వేసుకుని ఓ బ్యాగ్‌ చేతబట్టి తలనీలాల జుట్టుతో ఎంచక్కా జారుకుంటున్నాడు. సీసీ కెమెరాలో పట్టుబడ్డ ఇతని కోసం ఇప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం నాలుగు బృందాలుగా గాలిస్తున్నారు. ఇద్దరు దొంగలు వచ్చి ఈ పని కానిచ్చినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. భక్తుల మనోభావాలతో కూడుకున్న విషయమని దొంగలను పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు. అంతేకాదు.. జుట్టుకున్న డిమాండ్‌ కూడా తక్కువేం కాదు. ఆలయంలోని ఓ రూంలో తలనీలాలను భద్రపరిచి.. కాంట్రాక్టర్‌ ఓ తాళం, ఆలయ సిబ్బంది మరో తాళం వేస్తుంటారు. ఆ రెండు తాళాలను పగలగొట్టి… ఈ దొంగతనం చేయడం బట్టి చూస్తుంటే.. టెంపులో ఉన్న నిర్లక్ష్యం కూడా అద్దం పడుతోందని భక్తులు మండిపడుతున్నారు.

జుట్టు క్వాలిటీ పొడవును బట్టి ప్రస్తుతం మంచి రేటు పలుకుతుంది. అదే ఇప్పుడు దొంగల పాలిట వరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. చడీచప్పుడు లేకుండా ఆలయానికొచ్చి తలనీలాలు ఎత్తుకుపోయాడు. జుట్టుకున్న వ్యాల్యును తెలుసుకుని వాటినే ఎత్తుకెళ్లాడు. చిన్న గుడి అయినా దాని స్థాయిలో జుట్టే ఆదాయ వనరు. పైగా.. జరిగిన ఘటన గుడిలోది కాబట్టి పోలీసులు లైట్ తీసుకునే చాన్స్ లేదు. అందుకే అతగాడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. త్వరలోనే దొంగలను పట్టుకుని తీరుతామని జిల్లా పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Read Also… పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాకు మరో షాక్.. రాజీనామా చేసిన మరో మంత్రి..!