Auto Driver : ఆటో పట్టుకొని 3 నెలలైనా ఠాణా చుట్టూ తిప్పుకుంటున్నారని డ్రైవర్ ఆగ్రహం, ఫ్లైఓవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నం

|

Apr 02, 2021 | 11:20 PM

Auto Driver suicide attempt : శంషాబాద్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌ ఫ్లైఓవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తన వాహనం తిరిగి ఇవ్వాలంటూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శంషాబాద్‌ ఆర్‌జేఐఏ పోలీసు స్టేషన్‌ ఎదుట..

Auto Driver :  ఆటో పట్టుకొని 3 నెలలైనా ఠాణా చుట్టూ తిప్పుకుంటున్నారని డ్రైవర్ ఆగ్రహం, ఫ్లైఓవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నం
Follow us on

Auto Driver suicide attempt : శంషాబాద్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌ ఫ్లైఓవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తన వాహనం తిరిగి ఇవ్వాలంటూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శంషాబాద్‌ ఆర్‌జేఐఏ పోలీసు స్టేషన్‌ ఎదుట జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొత్తపేటకు చెందిన నాగరాజు నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం మద్యం సేవించి ఆటో నడపడంతో ఆర్‌జేఐఏ ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకొని వాహనం సీజ్‌ చేశారు. అప్పటి నుంచి నాగరాజు ఠాణా చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ ఆటో ఇవ్వకపోడంతో మనస్తాపం చెందిన నాగరాజు శుక్రవారం స్టేషన్‌ ఎదుటే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నాగరాజుకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగిందని ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తెలిపారు.

Read also : Road accident : ఓవర్ టర్న్ చేయబోయి పక్కన వెళ్తోన్న కారుపై పడ్డ మార్బుల్స్ లోడు లారీ, కారులో ఉన్న నలుగురూ స్పాట్ డెడ్