బాలుడి ముక్కు కొరికిన పొలిటికల్ లీడర్.. మరీ ఇంత కోపం అయితే ఎలా..?

|

Aug 08, 2022 | 6:14 PM

రాజకీయ నాయకులు అంటే.. నలుగురికి మంచి చెడ్డలు చెప్పి, సయోధ్య కుదర్చాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. తమను గెలిపించిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. తన..

బాలుడి ముక్కు కొరికిన పొలిటికల్ లీడర్.. మరీ ఇంత కోపం అయితే ఎలా..?
Bitting Nose Of Child
Follow us on

రాజకీయ నాయకులు అంటే.. నలుగురికి మంచి చెడ్డలు చెప్పి, సయోధ్య కుదర్చాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. తమను గెలిపించిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలి. కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్లు చేసే పనులు నవ్వు తెప్పిస్తే మరికొన్ని మాత్రం తీవ్ర కోపం కలిగిస్తాయి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నవ్వులపాలవడమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా నిలుస్తారు. అయితే ఈ పొలిటికల్ లీడర్ చేసిన పని తెలిస్తే మాత్రం మీకు కోపం రావడం పక్కా.. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా.. ఓ బాలుడి ముక్కు కొరికేశాడు. చిన్న తప్పు చేశాడనే కారణంతో ఊగిపోయి ముక్కును బలంగా పట్టుకుని కసితీరా కొరికేశాడు. ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పుర్ కు చెందిన సచిన సాహు అనే రాజకీయ నాయకుడి ఇంట్లో ఓ బాలుడు సహాయకుడిగా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం బాలుడు చిన్న తప్పు చేశాడన్న కోపంతో సచిన్ రగిలిపోయాడు. అంతే బాలుడి ముక్కు కొరికేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతడిని శనివారం రాత్రి స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి