ఇకపై నో ఐపీఎల్.. ఓన్లీ విదేశీ టీ20!

2011 ప్రపంచకప్ హీరో, టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాన్సర్ బారిన పడిన యూవీ.. ఆ తర్వాత కోలుకుని మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. అయితే అనుకున్నంత సాఫీగా యూవీ క్రికెట్ కెరీర్ సాగలేదనే చెప్పాలి. పలు మెగా టోర్నమెంట్స్‌లో తనదైన శైలిలో మెరిసిన ఈ సిక్సర్ల వీరుడు చివరికి క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇది ఇలా ఉంటే యూవీ ఇవాళ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో […]

ఇకపై నో ఐపీఎల్.. ఓన్లీ విదేశీ టీ20!
Follow us

|

Updated on: Jun 10, 2019 | 8:11 PM

2011 ప్రపంచకప్ హీరో, టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాన్సర్ బారిన పడిన యూవీ.. ఆ తర్వాత కోలుకుని మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. అయితే అనుకున్నంత సాఫీగా యూవీ క్రికెట్ కెరీర్ సాగలేదనే చెప్పాలి. పలు మెగా టోర్నమెంట్స్‌లో తనదైన శైలిలో మెరిసిన ఈ సిక్సర్ల వీరుడు చివరికి క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

ఇది ఇలా ఉంటే యూవీ ఇవాళ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 2019 ఐపీఎల్ తనకు చివరిదని.. ఇక మీదట ఐపీఎల్ ఆడకూడదని గతంలోనే నిర్ణయించుకున్నట్లు యూవీ తెలిపాడు. అయితే బీసీసీఐ అనుమతిస్తే విదేశాల్లో టీ20 క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఈ వయసులో ఎంజాయ్ చేస్తూ ఆడే టోర్నీల్లో అయితేనే ఆడాలనిపిస్తోందన్నాడు యూవీ. ఇకపోతే ఐపీఎల్‌‌లో యూవీ పంజాబ్, పూణే, బెంగళూరు, సన్‌రైజర్స్, ఢిల్లీ, ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Latest Articles