కరోనా జాగ్రత్తలు పాటించడంలో ముందంజలో మహిళలు

| Edited By:

Oct 07, 2020 | 8:34 AM

కరోనా‌ మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించడంలో మహిళలు ముందంజలో ఉన్నట్లు తేలింది. కొవిడ్‌ -19 నిబంధనలు పాటించడంలో

కరోనా జాగ్రత్తలు పాటించడంలో ముందంజలో మహిళలు
Follow us on

Covid spread precautions: కరోనా‌ మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించడంలో మహిళలు ముందంజలో ఉన్నట్లు తేలింది. కొవిడ్‌ -19 నిబంధనలు పాటించడంలో పురుషుల కంటే మహిళలు ఆదర్శంగా ఉంటున్నారని న్యూయార్క్‌, యేల్ యూనివర్సిటీ పరిశోధనలో స్పష్టమైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు బిహేవియర్‌ సైన్స్‌ అండ్‌ పాలసీలో ప్రచురితమయ్యాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా వైద్య నిపుణులు చేసిన సూచనలు.. మహిళలు బాగా పాటిస్తున్నారని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటంలో వారు ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొంది. మహిళలు సాధారణంగానే ఆరోగ్య సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉంటారని, ఇప్పుడు కరోనా విషయంలోనూ వారి జాగ్రత్తలు వ్యాప్తిని అరికట్టడంలో ఉపయోగపడుతున్నాయని వెల్లడించింది. ఇక పురుషుల్లో మాత్రం కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. అందుకే ప్రపంచంలో ఎక్కువ కరోనా బారిన పడిన వారిలో పురుషులు ఎక్కువగా ఉన్నారని స్పష్టం చేసింది. ఇప్పటికైనా పురుషులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Read More:

Bigg Boss 4: బీబీ హోటల్‌.. అవినాష్‌ తనకు ముద్దు పెట్టాలని చూశాడన్న అరియానా

Bigg Boss 4: హౌజ్‌లో ‘ఓదార్పుల పర్వం’.. కూల్‌ అయిన కంటెస్టెంట్‌లు