ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌ ఆలోచన..!

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 5:04 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 27 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఆరు లక్షల మందికిపైగా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాలు.. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ మహమ్మారి మన దేశంలోకి ఎంటర్‌ అవ్వడంతో.. ఇప్పుడు అన్ని రాష్ట్ర […]

ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌ ఆలోచన..!
Follow us on

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 27 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఆరు లక్షల మందికిపైగా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాలు.. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ మహమ్మారి మన దేశంలోకి ఎంటర్‌ అవ్వడంతో.. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ విదేశాలకు వెళ్లి వచ్చిన వారి జాబితా తీస్తోంది. అయితే ఈ పని త్వరగా కావాలంటే.. అనేక మంది కార్యకర్తలు కావాల్సిందే. ఈ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాల్లో.. ఇప్పటికిప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారి జాబితా రెడీ చేసేందుకు వలంటీర్లను నియమించుకుంటుంది.

ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టి.. ఇప్పుడు ప్రపంచానికి మార్గ దర్శకంగా నిలిచిందని.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. “సీఎం జగన్ ఏర్పాటు చేసిన ఈ వలంటీర్ వ్యవస్థ.. ప్రపంచానికే ఆదర్శంగా మారుతోంది. యుకె ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) 2.80 లక్షల మంది వలంటీర్ల అవసరముందని ప్రకటించి అత్యవసర నియామకాలు చేపట్టింది. ఇంతకంటే ప్రశంస ఏం కావాలి మన వలంటీర్ వ్యవస్థకు.” అంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సిఎం జగన్ గారు ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారుతోంది. యుకె ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) 2.80 లక్షల మంది వలంటీర్ల అవసరముందని ప్రకటించి అత్యవసర నియామకాలు చేపట్టింది. ఇంతకంటే ప్రశంస ఏం కావాలి మన వలంటీర్ వ్యవస్థకు.

— Vijayasai Reddy V (@VSReddy_MP) March 27, 2020