భ‌ద్రాద్రి మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు మృతి ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ సంతాపం

| Edited By:

Aug 19, 2020 | 1:39 PM

భద్రాద్రి దేవస్థాన తొలి ప్రధాన అర్చకులు కోటి రామకృష్ణమాచార్యులు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి భ‌ద్రాద్రి రామ‌య్య‌ ఆత్మస్థైర్యాన్నిఇవ్వాలని..

భ‌ద్రాద్రి మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు మృతి ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ సంతాపం
Follow us on

Minister Indrakaran mourns death of Former Chief Priest: భద్రాద్రి దేవస్థాన తొలి ప్రధాన అర్చకులు కోటి రామకృష్ణమాచార్యులు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి భ‌ద్రాద్రి రామ‌య్య‌ ఆత్మస్థైర్యాన్నిఇవ్వాలని ప్రార్థించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. భ‌ద్రాద్రి దేవస్థానం తొలి ప్రధాన అర్చకులుగా కోటి రామకృష్ణమాచార్యులు అర్ధశతాబ్ద కాలానికి పైగా రామయ్యకు విశేష సేవలందించారని కొనియాడారు. ఇటీవ‌లే తీవ్ర ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేర‌గా, ఆయ‌న‌కు క‌రోనా సోకింద‌ని వైద్యులు పేర్కొన్నారు. దీంతో చికిత్స పొందుతూ కోటి రామకృష్ణమాచార్యులు మంగళవారం తుదిశ్వాస విడిచారు.

కాగా దేవ‌స్థాన అర్చ‌క‌త్వం కోసం భ‌క్త రామ‌దాసు తీసుకొచ్చిన ఐదుగురు కుటుంబాల్లో కోటి వారి కుటుంబం ఒక‌టి. ఈ క్ర‌మంలో రామ‌కృష్ణ‌మాచార్యులు కూడా వంశ‌పారంప‌ర్య అర్చ‌కుడిగా రామ‌య్య‌కు విశేష సేవ‌లందించారు. దేవ‌స్థానం తొలి ప్రధాన అర్చ‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించి ప్ర‌స్తుతం విశ్రాంత అర్చ‌కుడిగా ఉన్న రామ‌కృష్ణ‌మాచార్యులు శ్రీ పాంచ‌రాత్ర‌గ‌మంలో తెలుగునాట సుప్ర‌సిద్ధ పండితులు. వేద పుస్త‌కం చేతిలో లేకుండా ఏ కార్య‌క్ర‌మాన్నైనా అవ‌లీల‌గా నిర్వ‌హించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. దాశ‌ర‌థీ శ‌త‌కాల‌ను అత్యంత మాధుర్యంగా ప‌ఠించేవారు.

Also Read: 

Kushboo Eye Injury : ప్ర‌ముఖ న‌టి కుష్బూ కంటికి గాయం

మెట్రో ఉద్యోగుల జీతభ‌త్యాల్లో 50 శాతం కోత‌

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న‌!