భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూ అమ్మకాలు..!

|

May 30, 2020 | 2:34 PM

భాగ్యనగర వాసులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రీవారి లడ్డూను రేపటి నుంచి హైదరాబాద్‌ ప్రజలకు అందుబాటులోకి రానుంది. లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తుల దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే స్వామివారి ఆశీస్సులు ఆయన ప్రసాదం రూపంలో భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ బోర్డు రూ. 25కే రాయితీ లడ్డూను భక్తులకు అందించడం మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాలలోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాలతో […]

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూ అమ్మకాలు..!
అలాగే 35.26 లక్షల శ్రీవారి లడ్డూలు జులై మాసంలో విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Follow us on

భాగ్యనగర వాసులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రీవారి లడ్డూను రేపటి నుంచి హైదరాబాద్‌ ప్రజలకు అందుబాటులోకి రానుంది. లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తుల దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే స్వామివారి ఆశీస్సులు ఆయన ప్రసాదం రూపంలో భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ బోర్డు రూ. 25కే రాయితీ లడ్డూను భక్తులకు అందించడం మొదలు పెట్టారు.

తెలుగు రాష్ట్రాలలోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించనున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ఇప్పటికే 60 వేల లడ్డూలను హైదరాబాద్ వాసుల కోసం నగరానికి పంపించింది. కాగా, టీటీడీ చేపట్టిన ఈ లడ్డూ అమ్మకాలకు విశేష స్పందన లభిస్తోందని చెప్పాలి.

Also Read: జగన్ కీలక నిర్ణయం… రైతులకు ప్రత్యేక కాల్ సెంటర్..