కరోనా వ్యాక్సిన్ : ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’తో అమెరికా భారీ డీల్‌..

|

Mar 31, 2020 | 2:46 PM

‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కంపెనీతో కరోనా వ్యాక్సిన్‌ కోసం అమెరికా భారీ డీల్‌ కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై అమెరికా గ‌వ‌ర్న‌మెంట్ కు చెందిన బయోమెడికల్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (బార్డా), జాన్సన్‌ అండ్‌ జాన్సన్ కంపెనీ సైన్ చేశాయి. దీని విలువ రూ.3,438 కోట్లు. ఈ ఒప్పందంలో భాగంగా 2021 మార్చిలోపు 100 కోట్ల డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను జాన్సన్‌ అండ్‌ జాన్సన్ కంపెనీ అమెరికాకు అందించ‌నుంది. కాగా ఇప్ప‌టికే […]

కరోనా వ్యాక్సిన్ : ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’తో అమెరికా భారీ డీల్‌..
Follow us on

‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కంపెనీతో కరోనా వ్యాక్సిన్‌ కోసం అమెరికా భారీ డీల్‌ కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై అమెరికా గ‌వ‌ర్న‌మెంట్ కు చెందిన బయోమెడికల్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (బార్డా), జాన్సన్‌ అండ్‌ జాన్సన్ కంపెనీ సైన్ చేశాయి. దీని విలువ రూ.3,438 కోట్లు. ఈ ఒప్పందంలో భాగంగా 2021 మార్చిలోపు 100 కోట్ల డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను జాన్సన్‌ అండ్‌ జాన్సన్ కంపెనీ అమెరికాకు అందించ‌నుంది.

కాగా ఇప్ప‌టికే కోవిడ్ వ్యాక్సిన్ కోసం జాన్స‌న్ అండ్‌ జాన్సన్ కంపెనీ విస‌త ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. అందుకోసం రూ.3,500 కోట్ల‌ను ప్ర‌త్యేకంగా కేటాయించింది. తాజాగా అమెరికా నుంచి రూ.3,438 కోట్లు ఆర్థిక స‌హ‌కారం కూడా ల‌భించ‌డంతో..ఈ ప్రాజెక్ట్ విలువ రూ.7వేల కోట్ల‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లోపు మ‌నుషుల‌పై ప్ర‌యోగ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి..వచ్చే ఏడాది ఆరంభంక‌ల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామ‌ని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రకటించింది. ప్ర‌స్తుతం వారు టెస్టులు జ‌రుపుతోన్న లీడ్‌ క్యాండిడేట్‌ వ్యాక్సిన్‌’ మెరుగైన ఫ‌లితాలు చూపుతున్న‌ట్టు వెల్ల‌డించింది.