తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా కలకలం

|

Jun 20, 2020 | 12:20 PM

తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలకలం స‌ృష్టిస్తోంది. పలువురు ఐపీఎస్ అధికారులకు కరోనా పాజిటివ్ తేలింది. ఇందులో ఓ మహిళ ఐపీఎస్ అధికారికి కూడా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది..

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా కలకలం
Follow us on

తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలకలం స‌ృష్టిస్తోంది. పలువురు ఐపీఎస్ అధికారులకు కరోనా పాజిటివ్ తేలింది. ఇందులో ఓ మహిళ ఐపీఎస్ అధికారికి కూడా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి  కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అతడిని ఇప్పటికే హౌం క్వారంటైన్‌కు పంపించారు. అతనితోపాటు అడిషనల్ డీజీ స్థాయి అధికారి సహాయకుడికి పాజిటివ్ రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. వారితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన పోలీస్ సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.  అయితే  ఇలా పోలీస్ శాఖలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారు విధులకు హాజరు కావద్దని… ఇంటివద్దే విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

ఇక లాక్‌డౌన్ సమయంలో  కరోనా పై పోరాటంలో ముందు వరుసలో ఉండి ఎంతో సాహసోపేతంగా విధులు నిర్వహించారు పోలీసులు. దేశం మొత్తం కరోనాతో ఇంటికే పరిమితమైనా.. పోలీసులు మాత్రం తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. ఇలా ప్రజలను కరోనా నుండి కాపాడే ప్రయత్నంలో కొందరు పోలీసులే దాని బారిన పడుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.