తెలంగాణలో తగ్గుతున్న కరోనా వ్యాప్తి .. గడిచిన 24 గంటల్లో కేసులు, మరణాలు ఎన్నంటే..

|

Dec 08, 2020 | 10:27 AM

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతం తో పోల్చుకుంటే కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడించిన 24 గంటల్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు 682 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణలో తగ్గుతున్న కరోనా వ్యాప్తి .. గడిచిన 24 గంటల్లో కేసులు, మరణాలు ఎన్నంటే..
Follow us on

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతంతో పోల్చుకుంటే కరోనా కేసుల సంఖ్య తగ్గుతూవస్తుంది. గడించిన 24 గంటల్లో రాష్ట్రంలో  కొత్తగా పాజిటివ్‌ కేసులు 682 కేసులు నమోదు అయ్యాయి. 55645 టెస్టులు చేయగా 682 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 119కేసుస్లు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1477కి చేరింది. తాజాగా కోలుకున్నవారు 761 మంది. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,65,367కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 7,696 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.