మద్యం దొరక్కపోవడంతో ఆత్మహత్య.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా..

| Edited By:

Mar 30, 2020 | 2:34 PM

దేశ వ్యాప్తంగా కోరోన మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ను కట్టడిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు (ఏప్రిల్‌ 14 వరకు) లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో సామాన్య జనానికి కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మద్యం దొరక్కపోవడంతో మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. మద్యం లేదన్న విషయం తట్టుకోలేక ఏకంగా పదుల సంఖ్యలో ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. శని, ఆదివారాల్లో […]

మద్యం దొరక్కపోవడంతో ఆత్మహత్య.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా..
Follow us on

దేశ వ్యాప్తంగా కోరోన మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ను కట్టడిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు (ఏప్రిల్‌ 14 వరకు) లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో సామాన్య జనానికి కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మద్యం దొరక్కపోవడంతో మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. మద్యం లేదన్న విషయం తట్టుకోలేక ఏకంగా పదుల సంఖ్యలో ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. శని, ఆదివారాల్లో కర్ణాటకలో నలుగురు మందుబాబులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా, కేరళలో ఇప్పటికీ మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. మరో ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని వైన్స్‌, బార్‌ షాపులు మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు.

ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం లేక కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో మద్యంతో వింతగా ప్రవర్తిస్తున్న కేసులు పెరుగుతున్నాయి.