బాల సుబ్ర‌మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితిపై సీనియ‌ర్ న‌టి స‌రోజ దేవి స్పంద‌న‌

| Edited By:

Aug 20, 2020 | 3:51 PM

ప్ర‌ముఖ సీనియ‌ర్ సింగ‌ర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై సీనియ‌ర్ న‌టి బి స‌రోజ దేవి స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల సుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను. భగవంతుడు నా ఆయుష్షుని..

బాల సుబ్ర‌మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితిపై సీనియ‌ర్ న‌టి స‌రోజ దేవి స్పంద‌న‌
Follow us on

ప్రముఖ సీనియ‌ర్ సింగర్ బాల సుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న హెల్త్ కండీష‌న్ గురించి స్పందిస్తున్నారు. తాజాగా ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై సీనియ‌ర్ న‌టి బి స‌రోజ దేవి స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల సుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను. భగవంతుడు నా ఆయుష్షుని కూడా ఆయనికి ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను. ఆయన స్వరం తేనె లాంటిది. అయన త్వరగా కోలుకోని మరిన్ని పాటలు పాడి అందరిని అలరించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

Read More:

నాతో పాటు నా కూతురికి కూడా క‌రోనా సోకిందిః మాళ‌విక‌

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి.. ప్ర‌ధాని మోదీ నివాళి

వ‌చ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వ‌న్ నేష‌న్‌-వ‌న్ రేష‌న్’