రష్యాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

| Edited By:

Jul 25, 2020 | 4:22 PM

రష్యాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు అదుపులో ఉంటూ వచ్చాయి. ఏడు వేల కేసుల నుంచి రోజురోజుకు తగ్గుతూ ఐదు వేలకు చేరాయి. తాజాగా శుక్రవారం..

రష్యాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
Follow us on

రష్యాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు అదుపులో ఉంటూ వచ్చాయి. ఏడు వేల కేసుల నుంచి రోజురోజుకు తగ్గుతూ ఐదు వేలకు చేరాయి. తాజాగా శుక్రవారం నాడు 5,848 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 23 కేసులు పెరిగి 5,871కి చేరింది. దీంతో ఇప్పటి వరకు
రష్యా వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,06,720కి చేరింది. దేశంలోని 83 ప్రాంతాల్లో ఈ కేసులు నమోదైనట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 146 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రష్యా వ్యాప్తంగా 13,192 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 5.97 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.