రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంః మంత్రి హ‌రీష్ రావు

| Edited By: Pardhasaradhi Peri

Apr 07, 2020 | 2:54 PM

గజ్వేల్ నియోజకవర్గంలోని రిమ్మన గూడ గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ..

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంః మంత్రి హ‌రీష్ రావు
Follow us on
గజ్వేల్ నియోజకవర్గంలోని రిమ్మన గూడ గ్రామంలో  శనగల కొనుగోలు కేంద్రాన్ని  మంత్రి హరీశ్ రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,  వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఏంపీపీ, జెడ్పిటీసీ, పీఏసీఏస్ చైర్మన్, రైతు బంధు నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 7770 వరి కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభిస్తున్నామని మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డించారు. . దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే  నేరుగా  కొనుగోలు చేస్తుందని చెప్పారు. శనగలకు  క్వింటాలుకు రూ. 4875లు మద్దతు  ధరత‌ కొనుగోళ్లు  చెప్పటనున్నట్లు తెలిపారు.   త్వరలోనే మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు కొనుగోళ్ల కేంద్రాలను ప్రతి మండలాల్లో ప్రారంభిస్తామన్నారు. కొనుగోళ్ల కోసం రూ. 30 వేల కోట్ల రూపాయలు  ప్రభుత్వం కేటాయించిందని వివరించారు.  ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పేదవాళ్ల కోసం ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రారంభించాలని ఆదేశించారు.
బాగా ఆరబెట్టిన ధాన్యాన్నే రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావలని మంత్రి హ‌రీష్ రావు సూచించారు. తేమ శాతం ఉంటే  కొనుగోళ్లు ఆలస్యమైతే మార్కెట్‌లో స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్నారు. తోటి రైతులకు ఇబ్బందులు రాకుండా, ఏ రోజు ధాన్యం ఆ రోజే కొనుగోళ్లు జరగాలంటే.. ధాన్యాన్ని ఆర బెట్టుకుని కొనుగోళ్ల కేంద్రలకు తేవాలని రైతులకు విజ్ణప్తి చేశారు. ఈ సంద‌ర్బంగా మ‌హ‌మ్మారి క‌రోనాపై కూడా అవ‌గాహ‌న క‌ల్పించారు. వ్యక్తిగత శుభ్రత, పరిశరాల శుభ్రతతో పాటు సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా ను కట్టడి చేయడం సాధ్యమ‌వుతుందన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులు ఒకే చోట గుమిగూడకుండా సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి వివ‌రించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో నీళ్లు, సబ్బు, శానిటైజర్లను రైతులకు అందుబాటులో ఉంచాల‌ని అధికారులను ఆదేశించారు. పోలీసులు రైతుల‌కు ప్రత్యేక పాసులు జారీ చేయాలని సూచించిన‌ట్లుగా తెలిపారు.