అమ్మాయిల పొట్టి దుస్తులు కరోనా వ్యాప్తికి కారణం.. పాక్‌లో వింత వాదన…

|

Apr 27, 2020 | 2:21 PM

కరోనా వైరస్ వ్యాప్తికి అమ్మాయిలే కారణం అంటూ ఓ పెద్ద మ‌నిషి వివాదాస్పాద వ్యాఖ్య‌లు చేశారు. ప్రధాని సమక్షంలోనే అనడం సంచలనానికి దారి తీసింది.

అమ్మాయిల పొట్టి దుస్తులు కరోనా వ్యాప్తికి కారణం.. పాక్‌లో వింత వాదన...
Follow us on
ఎక్క‌డో చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్ర బిందువుగా నోవెల్ క‌రోనా పుట్టింద‌నేది యావ‌త్ ప్ర‌పంచానికి తెలిసిన సంగ‌తే. అయితే, క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఆ వైర‌స్‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఓ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అమ్మాయిలే కార‌ణ‌మంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
కరోనా వైరస్ వ్యాప్తికి అమ్మాయిలే కారణం అంటూ ఓ మ‌తానికి చెందిన పెద్ద మ‌నిషి ఒక‌రు వివాదాస్పాద వ్యాఖ్య‌లు చేశారు. అమ్మాయిలు పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం వల్లే వైరస్ సోకిందని, వారి వల్లే పాకుతోందని పాక్ మత పెద్ద మౌలానా తారీఖ్ జమీల్ వ్యాఖ్య‌నించారు. ఆయన ఈ వ్యాఖ్యలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే అనడం సంచలనానికి దారి తీసింది. ఎసాహ్ టెలెథాన్ ఫండింగ్ సదస్సులో జమీల్, ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమీల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కాగా, పాకిస్తాన్‌లోనూ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 15 వేల మందికి పైగా కరోనా వ్యాధి బారిన పడ్డారు. సరైన వైద్య వసతులు లేకపోవడంతో వైద్యులు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు జంకుతున్నారు. ఇటువంటి త‌రుణంలో జ‌మీల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై  మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొందరికి కరోనాను అంటిపెట్టి మాట్లాడటం ఎంత వరకు సబబు అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని జమీల్ చెప్పడం గమనార్హం.