అక్కడ తగ్గుముఖం పట్టిన కరోనా…త్వరలోనే సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు రీఓపెన్

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ పాక్‌లో తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా..

అక్కడ తగ్గుముఖం పట్టిన కరోనా...త్వరలోనే సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు రీఓపెన్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 7:04 PM

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ పాక్‌లో తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా 484 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా అక్కడి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, వైరస్ కేసుల సంఖ్య తగ్గటంతో ఇప్పటికే చాలా వరకు కోవిడ్ నిబంధనలు సడలించిన పాక్ ప్రభుత్వం తాజాగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు కూడా తెరిచేందుకు అనుమతించింది. దీంతో దాదాపు ఆరు నెలలపాటు మూసివేయబడిన సినిమా హాల్స్, మల్టీపెక్సులు సెప్టెంబర్ 11 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి.

ఇదిలా ఉంటే, పాక్‌లో నమోదైన తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 298,509 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, మరో ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,382 కు చేరుకుందని వెల్లడించారు.