షాకింగ్‌ న్యూస్.. తబ్లీఘీ సమావేశాల్లో పాల్గొన్నది 16వేలకు పైగానే..!

| Edited By:

May 03, 2020 | 3:43 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం గురించి తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న సమయంలో కేసులు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. అయితే ఈ మర్కజ్ అంశం తెరపైకి రావడంతో దేశంలో కేసుల అమాంతం పెరిగిపోయాయి. ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా సోకడం.. వారంతా దేశంలోని నలుమూలలకు వెళ్లడంతో.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందింది. అయితే ఈ సమావేశాలకు హాజరైన వారంతా స్వచ్చందంగా ప్రభుత్వాధికారులను కలిసి.. స్థానికంగా […]

షాకింగ్‌ న్యూస్.. తబ్లీఘీ సమావేశాల్లో పాల్గొన్నది 16వేలకు పైగానే..!
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం గురించి తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న సమయంలో కేసులు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. అయితే ఈ మర్కజ్ అంశం తెరపైకి రావడంతో దేశంలో కేసుల అమాంతం పెరిగిపోయాయి. ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా సోకడం.. వారంతా దేశంలోని నలుమూలలకు వెళ్లడంతో.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందింది. అయితే ఈ సమావేశాలకు హాజరైన వారంతా స్వచ్చందంగా ప్రభుత్వాధికారులను కలిసి.. స్థానికంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. అయితే కొందరు మాత్రమే బయటకు రాగా.. చాలా మంది వైద్య సిబ్బందిపై దాడులకు యత్నించడం.. టెస్టులు చేయించుకోకుండా.. ప్రతిఘటించడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు తబ్లీఘీ చీఫ్.. విచారణకు రాకపోవడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో మార్చి 13 నుంచి 24 మధ్య ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన తబ్లీగీ సమావేశాల్లో పాల్గొన్న సంఖ్యపై పోలీసులు దృష్టిసారించారు. ఈ సమావేశానికి కనీసం 16,500 మంది పాల్గొని ఉంటారని పోలీసులు తయారు చేసిన రిపోర్ట్‌లో వెల్లడైంది.

ఈ రిపోర్టులను మర్క్జజ్ సమావేశానిక వెళ్లిన వారిని ప్రత్యక్షంగా కలవడంతో పాటుగా.. సెల్ ఫోన్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ లెక్కలు తీసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విషయాన్ని కేసును దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి వెల్లడించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన రిపోర్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. మర్కజ్‌ తబ్లీగీ జమాత్‌ మీటింగ్‌లలో పాల్గొన్న వారు.. వీరిని కలిసిన వారి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అన్ని పోలీస్ యూనిట్లు రంగంలోకి దిగాయి. ఈ సమావేశానికి హాజరైన 16 వేల మందిని.. ఎవరెవరు కలిశారన్నది తెలుసుకునేందుకు మరో పోలీస్ విభాగం రంగంలోకి దింపామని ఓ అధికారి తెలిపారు. అయితే వీరిలో కరోనాతో ఎక్కువ రిస్క్ కల్గిన వారిన తెలుసుకునేందుకు మరో టీంను ఏర్పాటు చేయగా.. పలు సందర్భాల్లో ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ కూడా పలు సందర్భాల్లో ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం కరోనా అనుమానిత వ్యక్తుల వివరాలను సదరు ఆరోగ్య శాఖ అధికారులకు అందించి.. కొందర్ని ఐసోలేషన్‌కు మరికొందర్నీ క్వారంటైన్‌కు తరలించినట్లు సదరు అధికారి వెల్లడించారు.