కరోనా పంజా: 15వేల మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌?

|

Jul 18, 2020 | 6:55 PM

భారత్‌లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య మిలియన్‌ మార్క్‌ దాటింది. మరోవైపు కరోనా మహమ్మారిపై పోరులో ముందుండి పోరాడుతున్న..

కరోనా పంజా: 15వేల మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌?
Follow us on

భారత్‌లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య మిలియన్‌ మార్క్‌ దాటింది. మరోవైపు కరోనా మహమ్మారిపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపైనా కరోనా పంజా విసురుతోంది. అయితే, తాజాగా జరిగిన అధ్యయనాల మేరకు దేశంలో 15,200 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు కరోనా సోకినట్లుగా నివేదికలు వెల్లడించాయి.

అయితే, కరోనా పోరులో వైద్య సిబ్బందికి అత్యవసరమైన ఆయుధాలైనటువంటి పీపీఈ, ప్రొటెక్టివ్ గేర్‌‌ తక్కువగా ఉండటంతోనే ఫ్రంట్‌ లైన్ వర్కర్స్‌లో చాలా మంది వైరస్‌ బారినపడినట్లుగా తెలుస్తోంది. ఇందులో 5 వేల మందికిపైగా విధి నిర్వహణలో వైరస్‌ సోకిందని పరిశీలకులు వెల్లడించారు. జూలై 17కు 5,170 హెల్త్ కేర్ వర్కర్స్‌ (హెచ్‌సీడబ్ల్యూ) అయిన డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఆన్ డ్యూటీలో టెస్టులు చేసిన టైమ్‌లో పాజిటివ్‌గా తేలారని తెలిసింది.