ఉస్మానియా ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ కు క‌రోనా పాజిటివ్

|

Jul 08, 2020 | 4:44 PM

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఒక్కో ఇంట్లో 5 నుంచి పదుల సంఖ్యలో కూడా పాజిటివ్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సోకటంతో..

ఉస్మానియా ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ కు క‌రోనా పాజిటివ్
Follow us on

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఒక్కో ఇంట్లో 5 నుంచి పదుల సంఖ్యలో కూడా పాజిటివ్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సోకటంతో పలు ఆఫీసులు, కార్యాలయాలు మూసివేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లకు సైతం కరోనా కారణంగా తాళాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అటు తెలంగాణ హైకోర్టుకు కూడా కోవిడ్ సెగ తగిలింది. దీంతో రేపటి నుంచి హైకోర్టును పూర్తిగా మూసివేస్తున్నట్లు న్యాయవాదులు వెల్లడించారు. కాగా, తాజాగా, ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్పత్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ బీ నాగేంద‌ర్ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

ఉస్మానియా ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు వైద్యం కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ని ఓ రోగికి వైద్యం చేసిన స‌మ‌యంలో డాక్ట‌ర్ నాగేంద‌ర్ కు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధారించారు. ప్ర‌స్తుతం డాక్ట‌ర్ ఐసోలేష‌న్ లో ఉన్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్ర‌భుత్వ వైద్యుల సంఘంలో సీనియ‌ర్ స‌భ్యులుగా కొనసాగుతున్న డాక్ట‌ర్ నాగేంద‌ర్.. గ‌చ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్(టిమ్స్)కు సంబంధించిన ప‌నుల‌ను పర్యవేక్షిస్తున్నారు.