స‌చివాల‌యంలో మ‌రొక‌రికి క‌రోనా..15కు చేరిన పాజిటివ్ కేసులు

|

Jun 13, 2020 | 2:46 PM

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను కోవిడ్ వద‌ల‌డం లేదు. ఏపీ స‌చివాల‌యంలో..

స‌చివాల‌యంలో మ‌రొక‌రికి క‌రోనా..15కు చేరిన పాజిటివ్ కేసులు
Follow us on

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను కోవిడ్ వద‌ల‌డం లేదు. ఏపీ స‌చివాల‌యంలో మ‌రొక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. తాజాగా న‌మోదైన కేసుతో క‌లిపి ఏపీ స‌చివాల‌యంలో క‌రోనా సోకిన వారి సంఖ్య 15కు చేరింది.

కాగా, రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు..గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 222 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5858కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 186 కేసులు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రాల్లో రెండు మరణాలు(కృష్ణా జిల్లాలోనే రెండు మరణాలు) సంభవించాయి. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది. అలాగే 2,591 యాక్టివ్ కేసులు ఉన్నాయి.