ఒడిషాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజే..

| Edited By:

Jul 10, 2020 | 2:45 PM

ఒడిషాలో అన్‌లాక్‌ 1.0 తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కరోనా కట్టడికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే..

ఒడిషాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజే..
Follow us on

ఒడిషాలో అన్‌లాక్‌ 1.0 తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కరోనా కట్టడికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేల మార్క్‌ దాటి.. పన్నెండు వేలకు చేరువయ్యింది. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 755 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,956కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారం నమోదైన కేసుల్లో గంజాం జిల్లాలో 320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని..  మరో 86 కేసులు జాజ్‌పూర్‌లో, 62 కేసులు సుందర్‌గర్‌లో నమోదయ్యాయి.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరవయ్యింది. శుక్రవారం నాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 26506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 4.9 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో రెండున్నర లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.