నార్త్ కొరియాలో తొలి కరోనా కేసు.. కఠిన లాక్‌డౌన్ అమలు..!

|

Jul 26, 2020 | 12:07 PM

కిమ్ ఇలాకాలో కరోనా వైరస్ కలకలం రేగింది. నార్త్ కొరియాకు దక్షిణాన సరిహద్దుగా ఉన్న కైసోంగ్‌ నగరంలో అధికారికంగా మొదటి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది.

నార్త్ కొరియాలో తొలి కరోనా కేసు.. కఠిన లాక్‌డౌన్ అమలు..!
Follow us on

North Korea Detects 1st Suspected Case Of COVID-19: కిమ్ ఇలాకాలో కరోనా వైరస్ కలకలం రేగింది. నార్త్ కొరియాకు దక్షిణ సరిహద్దు ప్రాంతమైన కైసోంగ్‌ నగరంలో అధికారికంగా మొదటి పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. తాజాగా కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడని తెలుస్తోంది. దీనితో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. సరిహద్దులను మూసివేయమని చెప్పడమే కాకుండా కైసోంగ్‌లో కఠిన లాక్ డౌన్ విధించినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.

మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన ఓ ఫిరాయింపుదారుడు జూలై 19న దేశ సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటి వచ్చాడని.. అతడికే కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని నార్త్ కొరియన్ మీడియా తెలిపింది. అయితే దక్షిణ కొరియా మాత్రం సరిహద్దుల్లో అలాంటి ఘటన ఏమి జరగలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరోనా బాధితుడు క్వారంటైన్‌లో ఉండగా.. డాక్టర్లు అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు గడిచిన కొద్దిరోజుల్లో అతడు ఎక్కడెక్కడికి తిరిగాడు.? ఎవరిని కలిశాడు.? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారందరినీ కూడా క్వారంటైన్‌కు తరలించాలని కిమ్ ఆదేశించనట్లు తెలుస్తోంది.

కాగా, ఇప్పటివరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకొచ్చిన కిమ్.. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుతో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశాడు. ”కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతాం. బోర్డర్ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కిమ్ ఆదేశించారు.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!

కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే పేదలకు సులభంగా లోన్స్..