మ‌రోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌..! బీహార్ సర్కార్ కీలక నిర్ణయం

| Edited By: Pardhasaradhi Peri

Jul 14, 2020 | 9:49 AM

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 28,701 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 500 మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. ఇటువంటి సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తుండగా, ఇప్పుడు మరోరాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్లేందుకు..

మ‌రోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌..! బీహార్ సర్కార్ కీలక నిర్ణయం
Follow us on

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 28,701 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 500 మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 8,78,254కు, మరణాలు 23,174కు చేరుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇటువంటి సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తుండగా, ఇప్పుడు మరోరాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

బీహార్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో మరోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరిన్ని చర్యల గురించి సమీక్షించ‌నున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే దిశ‌గా ఆలోచిస్తున్న‌ద‌ని చెప్పారు.

ఇకపోతే, బీహార్‌లో కరోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో కొత్తగా 1,116 కరోనా కేసులు గుర్తించినట్లుగా ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల‌ సంఖ్య 17,421 కు పెరిగింది. కరోనా బారినపడి ఓ డాక్టర్ మృతిచెందారు. 54 ఏళ్ల డాక్టర్ అశ్వని నందకులియార్ అనే వైద్యుడు ప‌ట్నాలోని ఎయిమ్స్‌లో క‌న్నుమూశారు.