Good News: కరోనాకు వ్యతిరేకంగా కొత్త ఆయుధం.. మొట్టమొదటి నాసల్ స్ప్రేకు డీసీజీఐ ఆమోదం

|

Feb 09, 2022 | 2:31 PM

కోవిడ్ 19 బారినపడ్డ పెద్దలకు చికిత్స చేసేందుకు 'గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్' దాని భాగస్వామి కెనడియన్ బయోటెక్ కంపెనీ ' సనోటైజ్ రీసెర్చ్' బుధవారం మార్కెట్లో నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (ముక్కు ద్వారా వ్యాక్సిన్) విడుదల చేసింది.

Good News: కరోనాకు వ్యతిరేకంగా కొత్త ఆయుధం.. మొట్టమొదటి నాసల్ స్ప్రేకు డీసీజీఐ ఆమోదం
Nitric Oxide Nasal Spray
Follow us on

First Nasal Spray in India: కోవిడ్ 19 (Covid 19)బారినపడ్డ పెద్దలకు చికిత్స చేసేందుకు ‘గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్’(Glenmark Pharmaceuticals) దాని భాగస్వామి కెనడియన్ బయోటెక్ కంపెనీ ‘ సనోటైజ్ రీసెర్చ్’ బుధవారం మార్కెట్లో నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (Nitric Oxide nasal Spray)(ముక్కు ద్వారా వ్యాక్సిన్) విడుదల చేసింది. ఈ స్ప్రే వ్యాధి సోకితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్న పెద్దల కోసం ఉద్దేశించినదిగా పేర్కొన్నారు. భారత్‌లో ‘ఫ్యాబిస్ప్రే’ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే తయారీ, అమ్మకానికి సంబంధించి ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ అనే కంపెనీ గతంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం పొందింది .

ఫ్యాబిస్ప్రే అనేది కోవిడ్ 19 వైరస్‌ను ముక్కు లోపల ఉండేలా నాశనం చేసేందుకు రూపొందించడం జరిగింది. అయితే, అది ఊపిరితిత్తులకు చేరదు. డ్రగ్ రెగ్యులేటర్ అయిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే యాక్సిలరేటెడ్ అప్రూవల్ ప్రాసెస్ తయారీ మార్కెటింగ్ కోసం వేగవంతమైన ఆమోదం పొందింది.

కంపెనీ అధికారిక ప్రకటనలో, “నాసల్ స్ప్రే భారతదేశంలో దశ III ట్రయల్స్ కీలక ముగింపు పాయింట్లను పూర్తి చేసింది. 24 గంటల్లో వైరల్ లోడ్‌లో 94 శాతం, 48 గంటల్లో 99 శాతం తగ్గింపును విజయవంతంగా పూర్తి చేసుకుంది.” నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (NONS) ట్రయల్స్ సమయంలో COVID 19 రోగులలో సురక్షితంగా బాగా తట్టుకోగలదని నిపుణులు చెబుతున్నారు. గ్లెన్‌మార్క్ సంస్థ దీనిని ఫాబిస్ప్రే బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తుంది.

నైట్రిక్ ఆక్సైడ్ నాసల్‌ను నాసికా శ్లేష్మంపై స్ప్రే చేసినప్పుడు, అది వైరస్‌కు వ్యతిరేకంగా భౌతిక, రసాయన అవరోధంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకటనలో, ‘FabiSpray ను రూపొందించడం జరిగింది. ఇది COVID 19 వైరస్‌ను చంపగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇది SARS CoV 2పై ప్రత్యక్ష యాంటీవైరల్ ప్రభావంతో యాంటీ మైక్రోబయల్ లక్షణాలను నిరూపితం అయ్యినట్లు పేర్కొన్నారు.

నాసికా శ్లేష్మం మీద స్ప్రే చేసినప్పుడు, NONS వైరస్‌కు వ్యతిరేకంగా భౌతిక, రసాయన అవరోధంగా పనిచేస్తుంది. అది ఊపిరితిత్తులకు వ్యాపించకుండా నిరోధిస్తుంది.’ నాసల్ స్ప్రే COVID 19కి సమర్థవంతమైన, సురక్షితమైన చికిత్సగా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాంటీవైరల్ చికిత్సను వివరిస్తూ, రాబర్ట్ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రోకార్ట్ మాట్లాడుతూ, “ఇది రోగులకు చాలా అవసరమైన సకాలంలో వైద్య ఎంపికను అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.” అని తెలిపారు. ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 71,365 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న ఒక్కరోజే 1,72,211 మంది కోలుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడి 1,217 మంది మరణించారు.

Read Also…  Covid 19: థర్డ్ వేవ్ ముగిసింది… నిద్రలేమి, బ్రెయిన్ ఫాగ్ వంటి పోస్ట్ కోవిడ్ కేసులతో ఇబ్బందిపడుతున్న బాధితులు