అటెండ‌ర్‌కు క‌రోనా ! ఆందోళ‌న‌లో మంత్రులు, క‌లెక్ట‌ర్‌

|

Apr 06, 2020 | 9:30 AM

నెల్లూరు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఢిల్లీ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న‌వారిలో చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉండ‌టం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌లెక్ట‌రేట్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న అంటెండ‌ర్‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు..

అటెండ‌ర్‌కు క‌రోనా ! ఆందోళ‌న‌లో మంత్రులు, క‌లెక్ట‌ర్‌
Follow us on

నెల్లూరు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఢిల్లీ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న‌వారిలో చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉండ‌టం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌లెక్ట‌రేట్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న అంటెండ‌ర్‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో జిల్లా క‌లెక్ట‌ర్ స‌హా, మంత్రులు, ఇత‌ర అధికారుల్లో టెన్ష‌న్ మొద‌లైంది.

మ‌ర్కజ్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొని తిరిగివచ్చిన ఓ కలెక్టరేట్ ఉద్యోగి యథావిధిగా నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో విధులకు హాజరయ్యాడు. రోజు మాదిరిగా కార్యాలయంలో విధులు నిర్వ‌హించాడు. కార్యాలయంలో కలెక్టర్ తోపాటు మంత్రులు జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడిపై సీఎం వారంతా సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అయితే ఆ సమావేశాల్లో అటెండర్‌గా ఉన్న ఆ వ్యక్తి అందరికీ తాగునీళ్లు – చాయ్ కాఫీ – తినుబండారాలు అందించారు. సమావేశానికి ఏర్పాట్లు చేశాడు. అయితే ఈ విషయం అతడికి కరోనా లక్షణాలు రావడంతో బయటపడింది. దీంతో సహోద్యోగులు భయాందోళన చెంది వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. షాక్కు గురైన కలెక్టర్ వెంటనే అతడిని క్వారంటైన్ కు తరలించారు.

క‌లెక్ట‌రేట్‌లో అటెండ‌ర్‌కు క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో అతడితో సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారులు భయాందోళన చెందుతున్నారు. సీఎంతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న మంత్రులు, – ఎమ్మెల్యేలు కూడా ఒకింత ఆందోళన పడుతున్నారు. అతడికి కరోనా సోకితే వెంటనే కలెక్టర్ కార్యాలయం ఉద్యోగులంతా క్వారంటైన్ కు వెళ్లాల్సిందే. అందుకే ఆ అటెండర్ తో క్లోజ్ గా ఉన్న వారిని అనుమానితులుగా గుర్తిస్తున్నారు. ఒకవేళ అతడికి కరోనా సోకి ఉంటే అతడి ద్వారా ప్రభుత్వ అధికారులకు ఎంతమందికి సోకి ఉంటుందేమోనని చర్చ సాగుతోంది.