చైనా ల్యాబ్‌లో తప్పిదమే కరోనా వ్యాప్తికి కారణం !?

|

Apr 18, 2020 | 12:37 PM

కోవిడ్‌-19 వైర‌స్ ప‌ట్ల ఆఖ‌రుకు అనుకున్నంత అయ్యింది. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొద‌టి నుంచి చెబుతున్న‌దే ఇప్పుడు నిజ‌మైంది. చైనా వల్లే ప్రపంచానికి ఈ దుస్థితి ఏర్పడిందని ట్రంప్‌ పలుమార్లు దుయ్యబట్టారు. కరోనాను చైనా వైరస్‌గా ఆయన అభివర్ణిస్తూ ఎదురుదాడి చేశారు. తాజాగా,ఇప్పుడు  అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు కూడా చైనాపై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ అంతర్జాతీయ న్యూస్ ఛానల్  సంచలన కథనాన్ని ప్రసారం చేసింది.. కరోనా వైరస్ వూహాన్ […]

చైనా ల్యాబ్‌లో తప్పిదమే కరోనా వ్యాప్తికి కారణం !?
Follow us on
కోవిడ్‌-19 వైర‌స్ ప‌ట్ల ఆఖ‌రుకు అనుకున్నంత అయ్యింది. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొద‌టి నుంచి చెబుతున్న‌దే ఇప్పుడు నిజ‌మైంది. చైనా వల్లే ప్రపంచానికి ఈ దుస్థితి ఏర్పడిందని ట్రంప్‌ పలుమార్లు దుయ్యబట్టారు. కరోనాను చైనా వైరస్‌గా ఆయన అభివర్ణిస్తూ ఎదురుదాడి చేశారు. తాజాగా,ఇప్పుడు  అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు కూడా చైనాపై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ అంతర్జాతీయ న్యూస్ ఛానల్  సంచలన కథనాన్ని ప్రసారం చేసింది.. కరోనా వైరస్ వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి బయటకొచ్చిందని, అప్పటి నుంచి వైరస్ ప్రస్థానం మొదలైందని ఆ కథనం పేర్కొంది. ఇనిస్టిట్యూట్ వైరాలజీలో కరోనా లాంటి ఎన్నో వైరస్ లపై ప్రయోగాలు చేస్తుంటారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఈ అధ్యయనంలో భాగం పంచుకున్న ఓ విద్యార్థి  చేసిన చిన్న పొరపాటుతో ఈ కరోనా వైరస్ ఆమెకు సోకిందనీ, ఆమె  ప్రియుడు ఇనిస్టిట్యూట్ సమీపంలో ఉన్న మాంసం కొనుగోలు చేయడం ద్వారా అతని నుంచి  వైరస్ ఇతరులకు వేగంగా సోకిందన్నది ఆ కథనం సారాంశం. ఈ కథనం ప్రసారం అయిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నట్లు  పేర్కొన్నారు..కరోనా వ్యాప్తికి చైనానే కారణమంటూ తాను చేసిన వ్యాఖ్యలకు  ఆ న్యూస్ చానల్ కథనం బలం చేకూరుస్తున్నదని ట్రంప్ పేర్కొన్నారు.