కేరళలో మరో 118 కరోనా కేసులు..

| Edited By:

Jun 19, 2020 | 9:54 PM

కేరళలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. అన్‌లాక్‌ 1.0 నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కేరళలో మరో 118 కరోనా కేసులు..
Follow us on

కేరళలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. అన్‌లాక్‌ 1.0 నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1,380 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రలు నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,509కి చేరింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో.. దాదాపు 130 హాట్‌స్పాట్‌లను గుర్తించి.. కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారు.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నాలుగు లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే 3.8 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 1.63 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2.04 లక్షలకు చేరుకుంది. కరోనా బారినపడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 12 వేల మందికి పైగా మరణించారు.